ప్రత్యేక హోదా పై ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీకి ప్రత్యేక హోదా ఒక ముగిసిన అధ్యాయం అని, ప్రత్యేక హోదా మినహాయించి ఏపీ అభివృద్ధి చేయడానికి కేంద్రం సుముఖంగా ఉందని ఇప్పటికే పలుమార్లు కేంద్ర సర్కార్ కరాఖండిగా తేల్చి చెప్పింది. అయినప్పటికీ ప్రత్యేక హోదా సాధిస్తాం అన్న నినాదంతో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్ర సర్కార్ ను అభ్యర్థిస్తోంది. తాజాగా ప్రజావ్యవహారాల సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రత్యేక హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను ఎప్పటికైనా సాధిస్తామని చెప్తున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. హోదాను మర్చిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు . హోదా విషయంలో కేంద్రం చెబుతున్న కారణాలు సరైనవి కాదన్న సజ్జల రామకృష్ణా రెడ్డి కేంద్ర సర్కార్ ప్రత్యేక హోదా ఇచ్చే దాకా ప్రతీ వేదికపై ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ అంశాన్ని సంజీవంగా ఉంచుతామని పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా డిమాండ్‌ను వదిలిపెట్టే ఉద్దేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు సజ్జల. అందుకే ఇటీవల కూడా సీఎం జగన్ ప్రత్యేక హోదా కోసం మోడీకి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. ఈ అంశం ఏదో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నది కాదని పేర్కొన్న సజ్జల పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు కాబట్టి అక్కడ ఇచ్చిన హామీ చట్టానికంటే గొప్పదని అది అమలు చెయ్యాలని పేర్కొన్నారు . ఎప్పటికైనా హోదా సాధించి తీరుతామని సజ్జల రామకృష్ణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు .
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications