కోడి కత్తి కేసులో మరో ట్విస్ట్- విచారిస్తున్న జడ్జి బదిలీ...
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు కేసుల దర్యాప్తులు, కోర్టుల విచారణలు, తీర్పులు ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఏ చిన్న నిర్ణయమైనా రాజకీయంగా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉండటంతో జనం కూడా వీటిని డేగ కన్నుతో చూస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో వైఎస్ జగన్ కోడి కత్తి కేసు విచారిస్తున్న న్యాయమూర్తి బదిలీ అయ్యారు. కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం.
ఏపీలో పలువురు న్యాయమూర్తుల్ని హైకోర్టు తాజాగా బదిలీ చేసింది. ఇందులో పలు జిల్లా కోర్టుల జడ్జీలతో పాటు ఇతర న్యాయస్ధానాల్లో విధులు నిర్వర్తిస్తున్న జడ్జీలు కూడా ఉన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం మూడు జిల్లాల జడ్జీలు బదిలీ అయ్యారు.

మరికొందరు అదనపు జడ్జీలు కూడా బదిలీ అయ్యారు. హైకోర్టు రిజిస్టార్ (విజిలెన్స్) గంధం సునీత తూర్పుగోదావరి జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మిన్) ఆలపాటి గిరిధర్ విశాఖ జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. విశాఖ జిల్లా జడ్జిని అదే జిల్లాలోని వ్యాట్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఛైర్మన్ గా బదిలీ చేశారు.
ఇదే క్రమంలో వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి కేసు విచారిస్తున్న విజయవాడ సెషన్స్ కోర్టు జడ్డి శ్రీనివాస ఆంజనేయమూర్తి కూడా బదిలీ అయ్యారు. ఆయన్ను కడప జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. దీంతో విజయవాడ సెషన్స్ కోర్టు జడ్డిగా మూడో అదనపు కోర్టు జడ్జిగా ఉన్న ఎ. సత్యానంద్ వచ్చారు. ఇప్పుడు సత్యానంద్ ఈ కోడి కత్తి కేసు విచారణ కొనసాగించాల్సి ఉంటుంది. దీంతో కేసు విచారణ ఆలస్యమయ్యే అవకాశాలూ లేకపోలేదు.
రాష్ట్రవ్యాప్తంగా పలు కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు. ముఖ్యంగా అదనపు జడ్డీలుగా పనిచేస్తున్న వారు, అదనపు సెషన్స్ కోర్టుల్లో జడ్జీలుగా ఉన్న వారిని కూడా అదే జిల్లాలతో పాటు పలు ఇతర జిల్లాలకు కూడా బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా బదిలీలు అయిన వారంతా మే 1 లోపు కొత్త స్ధానాల్లో చేరాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
-
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications