లిక్కర్ కేసులో జగన్ ను ఫిక్స్ చేసన కసిరెడ్డి - కీలక ఆధారాలు..!!

సంచలనంగా మారిన లిక్కర్ కేసులో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా చెబుతున్న కసిరెడ్డి విచారణ సమయంలో అనేక విషయాలను వెల్లడిం చారు. రిమాండ్ రిపోర్టులో ఈ కేసులో ప్రముఖుల ప్రమేయం గురించి ప్రస్తావన ఉంది. కసిరెడ్డి ముడుపుల డబ్బులు జగన్‌ ఓఎస్డీకే ఇచ్చినట్లుగా అంగీకరించారు. కాగా, ఈ కేసులో ఏ4గా ఎంపీ మిథున్ రెడ్డి..ఏ5 సాయిరెడ్డి ని చేర్చారు. ఈ కేసులో దోపిడీ 3,200 కోట్లుగా అంచనాకు వచ్చారు. ఇక, కసిరెడ్డికి రిమాండ్‌ విధించటంతో విజయవాడ జైలుకు తరలించారు.

జగన్ ఆదేశాలతో
లిక్కర్ కేసులో కసిరెడ్డి కీలక అంశాలను బయట పెట్టారు. సిట్ అధికారుల విచారణ సమయంలో జగన్‌ ఆదేశించగా.. తాను ఆచరించినట్లు వివరించారు. మిథున్‌ రెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి, వాసుదేవరెడ్డి కలిసి మద్యం నుంచి ముడుపులు పిండుకునేలా కార్యాచరణ సిద్దం చేసామని చెప్పుకొచ్చారు. జగన్‌ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ్‌ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డితోపాటు పలువురికి ఇందులో పాత్ర ఉందని కసిరెడ్డి అలియాస్‌ కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అంగీకరించినట్లు 'సిట్‌' వెల్లడించింది. రాజ్‌ కసిరెడ్డి రిమాండ్‌ రిపోర్టులో అనేక కీలక విషయాలు బయటపెట్టింది. ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో ఆయనను ప్రశ్నించామని... నేరం, దాని వెనుక ఉన్న కుట్ర, తన పాత్ర, ఇతరుల భాగ స్వామ్యంపై అన్ని అంశాలు అంగీకరించిన రాజ్‌ కసిరెడ్డి, చివరికి నేరాంగీకరపత్రంపై సంతకం చేసేందుకు నిరాకరించారని 'సిట్‌' పేర్కొంది.

interesting-issues-reveals-in-liquor-scam-remand-report-details-here

ఇలా చేసాం
పార్టీకి బాగా నిధులు వచ్చేలా మద్యం పాలసీపై వర్కవుట్‌ చేసే బాధ్యతను అప్పటి సీఎం జగన్‌ నాకు అప్పగించారని కసిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ పాలసీ ద్వారా పార్టీకి బాగా ఫండ్‌ రావాలని, పథకాల అమలుకూ ఆదాయం సమకూరాలని నిర్దేశించారు. దీంతో... బేవరేజెస్‌ కార్పొరేషనే లిక్కర్‌ షాపులు ఏర్పాటు చేసి మద్యం వ్యాపారం చేసేలా కొత్త పాలసీని రూపొందించామని వెల్లడించారు. మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకునేందుకు రూపొందించిన మా ప్లాన్‌ను అమలు చేసే బాధ్యతను అసిస్టెంట్‌ సెక్రటరీగా ఉన్న సత్యప్రసాద్‌కు అప్పగించామని వివరించారు. మద్యం ముడుపుల కుట్రకు హైదరాబాద్‌లోని విజయసాయి రెడ్డి ఇంట్లోనే ప్లాన్‌ చేసినట్లు అంగీకరించారు. మద్యం సీసా బేసిక్‌ ధర ఆధారంగానే మాకు ఉత్పత్తిదారులనుంచి ముడుపులు వచ్చేలా ఫిక్స్‌ చేశామని చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Take a Poll

అక్కడే ట్విస్ట్
రిమాండ్ రిపోర్టులో ఏ1గా రాజ్ కసిరెడ్డి, ఏ4 ఎంపీ మిథున్‌రెడ్డి, ఏ5గా విజయ సాయిరెడ్డిని పేర్కొనగా.. మత్తం 29 మందిని నిందితులుగా చేర్చారు. జగన్ చెబితేనే తాను చేసానని కసిరెడ్డి చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నా..నిందితుల జాబితాలో జగన్ ప్రస్తావన లేకపోవటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ6 సజ్జల శ్రీధర్‌రెడ్డి (నంద్యాల), ఏ7 ముప్పిడి అవినాశ్‌రెడ్డి (హైదరాబాద్‌), ఏ8 బూనేటి చాణక్య (హైదరాబాద్‌), ఏ9 టి.ఈశ్వర్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డి (తిరుపతి), ఏ10 ఎస్‌కె.సైఫ్‌ అహ్మద్‌ (శ్రీకాళహస్తి), ఏ11 ఆల్విక్‌ మల్టీ వెంచర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఏ12 కృపాటి ఎంటర్‌ప్రైజెస్‌, ఏ13 నైస్నా మల్టీ వెంచర్‌, ఏ14 ట్రిఫర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఏ15 విక్సో ఎంటర్‌ప్రైజెస్‌ సహా మరో 14 మంది పేర్లు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+