మృగశిర కార్తె రోజు చేపలు తినటం వెనుక కారణమిదే!!
నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభమైంది. వర్షాకాలానికి నాంది పలికే మృగశిర కార్తె నాడు చాలా మంది కచ్చితంగా చేపలు తింటారు. ఈరోజు చేపలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని నమ్ముతారు. జూన్ మొదటి వారంలో మృగశిర కార్తె వస్తుంది. మృగశిర కార్తె రోజు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు.
మృగశిర కార్తెలో తొలకరి జల్లులు కురవడంతో కాస్త ఎండ తాపం నుంచి ఉపశమనం పొందుతారు. సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుంచి నైరుతి రుతుపవనాలు వచ్చి వాతావరణం చల్లబడి ప్రకృతి లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక వాతావరణంలో మార్పులకు, మృగశిర కార్తె నాడు చేపలు తినడానికి సంబంధం ఉందని చెబుతారు.

మృగశిర కార్తె నాడు చేపలు తినడం మన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఈ విధంగా మృగశిర కార్తె నాడు చేపలు తినడం వల్ల ఆస్తమా, గుండె జబ్బుల రోగులకు ఉపశమనం దొరుకుతుందని నమ్ముతారు. వర్షాకాలం ప్రారంభంలో చేపలు తినడం మన శరీరంలో ఇమ్యునిటీని మరింత పెంచి వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల కలిగే వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని చెబుతారు.
వర్షాకాలం సీజన్ ప్రారంభంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే చేపలు తినడం ఒక్కటే మార్గమని భావించిన పూర్వీకులు మృగశిర కార్తె నాడు ఖచ్చితంగా చేపలు తినాలి అన్న దాన్ని ఆనవాయితీగా పెట్టారు. దానిని కొనసాగిస్తూ నేటికి మృగశిర కార్తె రోజు ప్రతి ఇంట్లోనూ ఘుమఘుమలాడే చేపల వంటకాలే దర్శనమిస్తున్నాయి.
కాగా మృగశిర కార్తె ప్రారంభంలోనే ఆస్తమా రోగులకు కావలసిన చేప మందు కూడా బత్తిని సోదరులు పంపిణీ చేస్తారు. ఈ చేప మందు ను తీసుకోవడానికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది ప్రజలు తరలి వస్తారు. ఈ సంవత్సరం కూడా చేపమందు పంపిణీకి బత్తిని సోదరులు సిద్ధం కాగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications