ఎన్ని భరించాలని అమ్మాయి ఆత్మహత్య (ఫొటోలు)

హైదరాబాద్: చదువు ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై ఓ అమ్మాయి ఉసురు తీసుకుంది. ఉరివేసుకుని ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాదులోని ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చైతన్య కళాశాల హాస్టల్ గదిలో జరిగింది.

వరంగల్ జిల్లాకు చెందిన సుధీర్ రెడ్డి కూతురు శివాని (17) ఎల్బీనగర్ డిసిపి కార్యాలయం సమీపంలోని ఓ ప్రైవేట్ బాలిక ల జూనియర్ కళాశాలలో బైపిసి రెండో సంవత్సరం చదువుతోంది. బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. 440కు 338 మార్కులు వచ్చాయి. మార్కులు తక్కువ వచ్చాయని భావించి మానసిక ఒత్తిడికి గురైంది.

నాకింకా ఓపిక లేదు, ఎన్ని భరించాలి.. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంత తక్కువగా రాలేదు.. నాకు బతకాలని లేదు. నేను పిరికిదాన్ని అంటూ డైరీలో రాసుకుంది. తనకు గతంలో ఉన్న మధుర స్మృతులు ఇక ముందు ఉండేవేమోనని ఆందోళనకు గురై జీవితాన్ని ముగిస్తున్నట్లు అందులో రాసుకుంది.

విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల కార్యకర్తలు పెద్ద యెత్తున ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. హైదరాబాదులోని ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని శివాని మృతిపై విచారణ చేపట్టారు.

మార్కులు తక్కువ వచ్చాయని..

మార్కులు తక్కువ వచ్చాయని..

తనకు మార్కులు తక్కువ వచ్చాయని ఒత్తిడికి గురై మనస్తాపంతో శివాని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

చున్నీతో ఉరి వేసుకుంది

చున్నీతో ఉరి వేసుకుంది

బుధవారం మధ్యాహ్నం మూడున్న గంటల సమయంలో తన హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయం చూసి శివాని చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకుంది.

అప్పటికే మృతి

అప్పటికే మృతి

హాస్టల్ వార్డెన్ అపస్మారక స్థితికి చేరుకున్న శివానిని ఎల్బీనగర్‌లోన కామినేని ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

తల్లిదండ్రుల కడుపుకోత

తల్లిదండ్రుల కడుపుకోత

సమాచారం అందుకున్న శివాని తల్లిదండ్రులు బుధవారం రాత్రి ఆస్పత్రికి చేరుకుని మృతదేహం వద్ద బోరున విలపించారు.

యాజమాన్యంపై ఆరోపణ

యాజమాన్యంపై ఆరోపణ

మార్కులు తక్కువ వచ్చాయని యాజమాన్యం ఒత్తిడి చేయడం వల్లనే తమ కూతురు మరణించిందని శివాని తల్లిదండ్రులు ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+