వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనసీమలో టెకీల పాట్లు.. నెట్ బందవడంతో తప్పని ఇబ్బందులు..గోదావరి ఒడ్డున

|
Google Oneindia TeluguNews

కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై ఇటీవల అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వివాదం మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. వివాదం కోసం అయితే ఓకే.. కానీ అక్కడ ఉండి కొలువు చేసేవారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. నెట్ రాక.. పని జరగ వారి కష్టాలు వర్ణణాతీతం.

ఐటీ ఉద్యోగుల ఇక్కట్లు

ఐటీ ఉద్యోగుల ఇక్కట్లు

కోనసీమ జిల్లాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కష్టం వచ్చింది. ఇంటర్నెట్ బంద్ కావడంతో ఇబ్బంది పడుతున్నారు. గోదావరి నది ఒడ్డున నిలబడి పని చేసుకునే సిచుయేషన్ వచ్చింది. అక్కడ ఇంటర్నెట్ సర్వీస్ వస్తుండటంతో ల్యాప్ ట్యాప్‌లతో అక్కడికి తీసుకెళ్లి పని చేస్తున్నారు. అమలాపురంలో అల్లర్ల తర్వాత జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ముక్తేశ్వరంలోని ఐటీ ఉద్యోగులు ఇబ్బంది అంతా ఇంతా కాదు.

 ప్రస్తుతం ఓకే..

ప్రస్తుతం ఓకే..


అమలాపురాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రజలకు నిత్యవసరాల కోసం ఇబ్బంది కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అల్లర్లు జరిగిన మరుసటి రోజు నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గొడవలు జరక్కుండా, వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే అంశాలు ఫార్వార్డ్ చేసుకోకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

 ఇంటర్నెట్ రావడంతో

ఇంటర్నెట్ రావడంతో


అమలాపురం పరిసర ప్రాంతాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్నెట్ సర్వీస్ నిలిచిపోవడంతో వారి విధులు ఆగిపోయాయి. ముక్తేశ్వరం ప్రాంతంలో కొద్దిమేర ఇంటర్నెట్ సర్వీస్ వస్తోంది. విషయం తెలిసిన టెకీలు.. తమ ల్యాప్ ట్యాప్ తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడే తమ పని కానిచ్చేస్తున్నారు.

English summary
internet off in the konaseema due to clash. techies are come to godavari river bank for their work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X