అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డి వేటలో ఇంటర్‌పోల్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డిని పట్టుకోవడానికి గాలింపు చర్యలను వేగవంతం చేశారు.గంగిరెడ్డిని పట్టుకోవడానికి అంతర్జాతీయ సంస్థ ఇంటర్‌పోల్ కూడా రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఇంటర్‌పోల్ అధికారులు గంగిరెడ్డి ఫోటోను ఇంటర్నెట్‌లో పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గంగిరెడ్డి అంతర్జాతీయ స్మగ్లర్‌గానే కాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జరిగిన హత్యాయత్నం కేసులోనూ ప్రధాన నిందితుడు కావడంతో అతన్ని పట్టుకోవడానికి ఏపీ పోలీసులు కూడా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అంతర్జాతీయ స్మగ్లర్‌గా పెరుపొందిన గంగిరెడ్డి విదేశాలలో తలదాచుకున్నట్లుగా భావించిన ఏపీ పోలీసులు ఏసీబీ అధికారుల ద్వారా ఇంటర్‌పోల్ అధికారులకు నోటీసులు అందజేశారు.

ఈ క్రమంలోనే ఇంటర్ పోల్ అధికారులు గంగిరెడ్డి ఫోటోను ఇంటర్‌నెట్‌లో పెట్టారని సమాచారం. గంగిరెడ్డి దుబాయ్‌లోగానీ, సౌదీ దేశాలలోగాని తలదాచుకున్నాడని ఏపీ పోలీసులు భావిస్తున్నారు. ఇంటర్‌పోల్ అధికారుల సహాయంతో త్వరలోనే గంగిరెడ్డిని పట్టుకుంటామని రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు.
కాగా, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. గత రెండు మూడు రోజు లుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌పై దాడులు నిర్వహించిన అధికారులు 22 మంది ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దాదాపు రూ.30 లక్షలు విలువ చేసే 42 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది వాహనాలను అధికారులు సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications