విజయనగరం టు తిరుపతి: 19వేల కోట్లు పెట్టుబడులు..ఏపీ హవా

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం నెలకొంది. పరిశ్రమలు ఏపీకి తరలివస్తోన్నాయి. పరిశ్రమల వికాసానికి జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోన్న నేపథ్యంలో-వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు పారిశ్రామికవేత్తలు.

పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి వచ్చే పెట్టుబడిదారులకు ప్రభుత్వం పలు అవకాశాలు కల్పిస్తోంది. వారు కోరిన మేరకు భూములు ఇవ్వడంతోపాటు పలు రాయితీలు.. మౌలిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫలితంగా 2019- 2023 మధ్యకాలంలో గుజరాత్ తరువాత ఏపీ.. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది.

Investment to flow in Andhra tune of Rs 19037 crore

పరిశ్రమల స్థాపన, వాణిజ్యాభివృద్ధికి ఏపీ ఇప్పుడొక చిరునామాగా మారింది. విశాఖ పెట్టుబడుల సదస్సులో అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు సైతం పాల్గొన్న విషయం తెలిసిందే. 13 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో.

కడప స్టీల్ ప్లాంట్, విశాఖలో టైర్ల పరిశ్రమలు, సాఫ్ట్ వేర్, ఫార్మా రంగాల్లో భారీగా పరిశ్రమలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో పలు పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు మంత్రిమండలి సమావేశంలో 19,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పలు పరిశ్రమల స్థాపనకు ఆమోదం తెలిపారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద రిలయన్స్ పవర్ ఆధ్వర్యంలో రూ. 6174 కోట్ల పెట్టుబడితో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రాబోతోంది. దీనికోసం సంస్థ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపగా దాన్ని మంత్రిమండలి ఆమోదించింది.

దీనివల్ల 600 మందికి ప్రత్యక్షంగా, మరో 2,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సమీపంలోని పారిశ్రామికవాడలో స్మైల్ కంపెనీ రూ. 166 కోట్లతో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చింది. దీనివల్ల దాదాపు 5000 మందికి ఉపాధి దొరుకుతుంది.

ఇదే సెజ్ లో ఉన్న ఏటీసీ టైర్స్ సంస్థ రూ. 679 కోట్లతో సంస్థను విస్తరించనుండగా దీనిలో కొత్తగా 300 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఏలూరులోని కొమ్మూరువద్ద రూ. 114 కోట్లతో ఏర్పాటు కానున్న వెంకటేశ్వర బయోటెక్ సంస్థ 310 మందికి ఉపాధికల్పించే పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది.

తిరుపతిలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ సంస్థ రూ. 933 కోట్లతో సంస్థను విస్తరిస్తుండగా దీనివల్ల 2100 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. రాజమండ్రి సమీపంలోని కడియం వద్ద ఉన్న ఆంధ్రా పేపర్ మిల్లు విస్తరణకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. దీనికోసం రూ. 4,000 కోట్లు పెట్టుబడి పెడుతుండగా దీనివల్ల 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి.

విజయనగరంలోని ఎస్. కోట వద్ద రూ. 531 కోట్లతో ఏర్పాటు చేస్తున్న జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కులో ప్రత్యక్షంగా 35,750 మందికి, పరోక్షంగా 9,375 మందికి ఉపాధి లభిస్తుంది. విశాఖ జిల్లా పద్మనాభం వద్ద రూ. 50 కోట్లతో ఓరిల్ ఫుడ్స్ సంస్థ ఏర్పాటు కానుండగా దీనిలో 550 మందికి ఉద్యోగాలు వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+