అమరావతి భూముల ధర ఎంతో తెలుసా..ఒక్కో ఎకరం..!?
అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. నిర్మాణాల పూర్తి చేసేందుకు గడువు నిర్దేశించారు. ఆర్దికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే సమయంలో పూర్తి చేసిన అధికారుల నివాస భవనాలను ప్రభుత్వానికి అప్పగించేందుకు సీఆర్డీఏ సిద్దమైంది. ఇక.. రాజధానిలో కొత్తగా హోటళ్లు.. ప్రయివేటు స్కూళ్ల ఏర్పాటు కోసం టెండర్లను ఆహ్వానించారు. ఇందులో ధరలు ఫిక్స్ చేసారు.
అమరావతి కేంద్రంగా కొత్తగా హోటళ్లు.. స్కూళ్ల ఏర్పాటు కోసం సీఆర్డీఏ తాజాగా ప్రతిపాదన అభ్యర్థన (ఆర్‌ఎఫ్‌పీ)లను ఆహ్వానించింది. ఈ నెలాఖరు వరకు వివిధ సంస్థల నుంచి ఆర్‌ఎఫ్‌పీలను స్వీకరించి ఆ తర్వాత నిబంధనల మేరకు ఏజెన్సీలను ఖరారు చేయనుంది. అందులో భాగంగా స్టార్ హోటళ్ల కోసం ఎకరానికి రూ.8.20 కోట్ల ధరను సీఆర్డీఏ నిర్ణయించింది. అమరావతిలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర. సీఆర్డీఏ పరిధిలో స్టార్ హోటళ్లకు 9.19 ఎకరాలు.. ప్రైవేట్ స్కూళ్లకు 15.80 ఎకరాల భూమిని కేటాయించారు. స్కూల్ నిర్మాణం కోసం 33ఏళ్ల పాటు భూమిని లీజుకు తీసుకోవచ్చని వెల్లడించారు కాగా. హోటల్ నిర్మాణానికి కేటాయించిన భూమి.. ఎకరానికి రూ.8.20 కోట్ల ధర నిర్ణయించారు. త్రీ స్టార్ హోటల్ నిర్మాణానికి రూ.75 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలి. ఇదేవిధంగా ఫోర్ స్టార్ హోటళ్లని 175 గదులతో నిర్మించాలి.

సీఆర్డీఏ తాజా నిర్ణయాలతో
కాగా.. రాజధానిలో నాణ్యమైన విద్యా సంస్థలను ప్రోత్సహించేందుకు ఐదు ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటుకు 15.80 ఎకరాల భూమిని కేటాయించింది. ఎల్‌కేజీ నుంచి ప్లస్-2 వరకు విద్య అందించే పాఠశాలలు ఏర్పాటు చేయాలని టెండర్లలో పేర్కొంది. స్కూళ్లకు ఎకరానికి రూ.4.10 కోట్ల ధర నిర్ణయించి, 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన భూములు కేటాయించనుంది. తుళ్లూరు, నవులూరు, పెనుమాక, కృష్ణాయపాలెం, దొండపాడు ప్రాంతాల్లో ఈ స్కూళ్లు ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు వివిధ సంస్థల నుంచి ఆర్‌ఎఫ్‌పీలను స్వీకరించి ఆ తర్వాత నిబంధనల మేరకు ఏజెన్సీలను ఖరారు చేయనుంది. ఇక.. ఫోర్ స్టార్ హోటళ్లని 175 గదులతో నిర్మించాలి. వీటిల్లో 2,500 సీటింగ్ సామర్థ్యం కలిగిన బ్యాంకెట్/కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications