ఏపీ దేశంలో ఉందా లేదా -జగన్ కు మోడీ భయం పట్టుకుంది : మేము ఏంటో చూపిస్తాం - వీర్రాజు...!!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ ప్రభుత్వపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ప్రజలపై భారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, అయిల్ ధరలు తగ్గించిందని వివరించారు. ఎపి ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేసారు. ఏపీ దేశంలో ఉందా లేదా అనేది జగన్ చెప్పాలంటూ వ్యాఖ్యానించారు. పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ప్రభుత్వ వైఖరి వితండవాదంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రజాధనం వినియోగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

మేమేంటో ఏపీ ప్రభుత్వానికి చూపిస్తాం

మేమేంటో ఏపీ ప్రభుత్వానికి చూపిస్తాం

కరోన సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ఆదుకుందని చెప్పారు. ఏపీకి కూడా అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని వివరించారు. ఆత్మ నిర్భర భారత్ కింద కేంద్రం ఏపీకి సాయం చేసిందన్నారు. జగన్ కు మోడీ భయం పట్టుకుందంటూ కామెంట్ చేసారు. మోడీతో జగన్ డీ అంటే మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. తాము ఏంటో ఏపీ ప్రభుత్వానికి చూపిస్తామని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని విమర్శించారు.

గోతులు తవ్వే రాజకీయాలు వద్దు

గోతులు తవ్వే రాజకీయాలు వద్దు

అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు టాక్సులు తగ్గించినప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించదని ప్రశ్నించారు. మేము సాయం చేస్తేనే ఏపీని పరిపాలిస్తామని ఎన్నికల ముందు ఎమ్మెల్యే పార్థసారథి ఎందుకు చెప్పలేదని నిలదీసారు. మీకు ఓట్లు వేస్తే ప్రత్యేక హోదా, రాజధాని తెస్తామని ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఏపీలో జాతీయ రహదారులను అభివృద్ధి చేసామని చెప్పారు. ఏపీలో 2500 కోట్లు రాజధానికి ఇచ్చాము,4700 కోట్ల రుణం ఇప్పించామని లెక్కలు చెప్పారు. రోడ్లపై గోతులు పూడ్చలేని జగన్ ప్రభుత్వం,గోతులు తవ్వే రాజకీయాలు చేయొద్దంటూ వ్యాఖ్యానించారు.

Recommended Video

    ఏపిలో అరాచకం రాజ్యమేలుతుందన్న టీడిపి జాతీయ అధికార ప్రతినిధి దివ్యవాణి || Oneindia Telugu
    రాజధాని పై మాట ఇచ్చి ఎందుకు తప్పారు

    రాజధాని పై మాట ఇచ్చి ఎందుకు తప్పారు

    మాట ఇచ్చి రాజధానిని ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. రాజధానిపై మాట ఇచ్చి మాట ఎందుకు తప్పారని నిలదీసారు. రాజధాని నిర్మాణం పేరుతో 4రూపాయల సెస్ వసూలు చేస్తూ రాజధాని ఎందుకు నిర్మించడం లేదని వీర్రాజు అడిగారు. రాజధాని నిర్మిస్తామని ఒకరు పారిపోయారన్నారు. అస్తవ్యస్తం నిర్ణయాలతో ఆంద్ర రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వానికి చర్చకు రావాలని ఛాలెంజ్ చేసారు. తాము ఎంత పెంచామో ఎంత తగ్గించామో చాలా స్పష్టంగా చెప్పామన్నారు. భారతదేశం లో అన్ని రాష్ట్రాలు ఒకవిధంగా ఉంటే ఎపి ప్రభుత్వం ఒక విధంగా వ్యవహరిస్తోందని సోమువీర్రాజు దుయ్యబట్టారు

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+