హెరిటేజ్ అవు బంగారు పాలిస్తోందా: అంబటి, నాలుగు రెట్లిస్తామని లోకేష్‌కు సవాల్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తుల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంగళవారం నాడు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఆస్తులు అంతగా ఉండేందుకు.. హెరిటేజ్ ఆవులు ఏమైనా బంగారు పాలు ఇస్తున్నాయా అని చురక అంటించారు.
చంద్రబాబు తన రూ.42 లక్షల ఆస్తితో ప్యాలెస్ ఎలా కడతారని ప్రశ్నించారు. దీనిపై ఇండిపెండెంట్ ఆడిటర్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఎవరిని నమ్మించేందుకు ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని నారా లోకేష్ పైన మండిపడ్డారు.
మీ ఆస్తులు ఇంతేనని ఎవరూ నమ్మరన్నారు. అబద్దాలతో ప్రజలను ఎవరూ మోసం చేయలేరన్నారు. పాలు, కూరగాయలు అమ్మి కోట్లు గడించే వారు ఉన్నారా అని ఎద్దేవా చేశారు. హెరిటేజ్ పాలు బంగారం ఇస్తున్నాయా అని నిలదీశారు.

మీ అస్తుల విలువ నిజమే అయితే రిటైర్డ్ జడ్జితో విచారణకు సిద్ధం కావాలని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. మీ ఆస్తుల విలువకు నాలుగు రెట్లు ఎక్కువ ఇస్తామని, మీ ఆస్తులు మాకు ఇచ్చేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఎవరిని నమ్మించేందుకు మోసపూరిత ప్రకటనలు అన్నారు. అబద్దాలతో ప్రజలను మోసగించడం దారుణం అన్నారు.
ఏపీ, తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను అన్వేషించట్లేదని మండిపడింది. పరిహారంతో మృతుల కుటుంబాలకు న్యాయం జరగదని, రైతు ఆత్మహత్యల శాశ్వత నివారణకు చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది.
దానికి సంబంధించి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. గతంలో చనిపోయిన రైతుల పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రెండు ప్రభుత్వాలకు చెప్పింది.
ఇటీవల చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.6 లక్షలకు పెంచడంపై కోర్టు తీవ్రంగా మండిపడింది. రైతు చనిపోయిన తర్వాత పరిహారాన్ని పెంచి ఉపయోగమేమిటని ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications