నిన్న బాబు వాడుకొని వదిలేస్తారని, నేడు జగన్ వైపు జయప్రద అడుగులు, జనసేన ఆప్షన్?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రముఖ నటి, యూపీ రాజకీయాల్లో కీలక నేత జయప్రద వైసిపి అధినేత వైయస్ జగన్ వైపు అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చదవండి: వాడుకొని వదిలేస్తారు: బాబుపై జయప్రద, జగన్‌కి పొగడ్త

రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతాయో ఎవరూ ఊహించలేరు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఆమె తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. కానీ రాలేదు.

చదవండి: కోర్టు షాక్, డీలాపడ్డ జగన్ ఇలా: అసెంబ్లీ బాధ్యత పెద్దిరెడ్డికి, బడ్జెట్‌కు రావాల్సిందే

మళ్లీ ఏపీ వైపు చూపులు

మళ్లీ ఏపీ వైపు చూపులు

ఇప్పుడు ఆమె చూపు ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నట్లుగా తెలుస్తోంది. జయప్రద చాన్నాళ్లుగా ఏపీ రాజకీయాలపై దృష్టి సారించినట్లుగా ఆమె మాటల ద్వారా అర్థమైంది. కానీ ఆమెకు ఏదీ కుదిరినట్లుగా లేదు.

చంద్రబాబు వాడుకొని వదిలేస్తారని ఆరోపణలు, అందుకే

చంద్రబాబు వాడుకొని వదిలేస్తారని ఆరోపణలు, అందుకే

ఇప్పుడు మరోసారి ఏపీ వైపు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఆమె వైసిపి వైపు అడుగులు వేయనున్నారనే ప్రచారం సాగుతోంది. ఆమె వైసిపి వైపు చూడటానికి ఓ కారణం ఉందని అంటున్నారు. చంద్రబాబుకు వాడుకొని వదిలేయడం అలవాటేనని ఆమె గతంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆమె టిడిపి వైపు వెళ్లే అవకాశాలు తక్కువ అంటున్నారు.

చంద్రబాబుపై వ్యాఖ్యలు సంచలనం రేపాయి

చంద్రబాబుపై వ్యాఖ్యలు సంచలనం రేపాయి

గతంలో ఆమె టిడిపిలో పని చేశారు. ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా ఉన్నారు. ఆ తర్వాత యూపీ రాజకీయాల్లోకి వెళ్లారు. కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన జయప్రద.. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు అవి సంచలనం రేపాయి.

జయప్రదకు మరో ఆప్షన్

జయప్రదకు మరో ఆప్షన్

జయప్రదకు ఏపీలో మరో ఆప్షన్ కూడా ఉందని అంటున్నారు. అది జనసేన. ప్రస్తుతం ఆమె చూపు వైసిపి వైపు ఉందని, అలాగని జనసేనలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. వైసిపితో మాత్రం చర్చలు జరుగుతున్నాయట. గతంలో టిడిపిలో పని చేసిన జయప్రద వైసిపిలో చేరినా, జనసేనలో చేరిన టిడిపికి షాక్ అని చెప్పవచ్చు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Actress and politician Jayaprada is seeing at YSR Congress Party in Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి