వాడుకొని వదిలేస్తారు: బాబుపై జయప్రద, జగన్‌కి పొగడ్త

ఆంధ్ర ప్రదేశ్‌ను తాను అల్లకల్లోలంగా చూడాలని భావించడం లేదన్నారు. తాను ఆంధ్రాలో పుట్టినప్పటికీ అక్కడి ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా తనను ఆదరించారన్నారు. ఏ ప్రాంతానికి నష్టం జరగవద్దన్నారు. తెలంగాణ అంశాన్ని కేంద్రం త్వరగా తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు పార్టీ నెల రోజుల్లో తెలంగాణను తేల్చుతామన్న మాటకు కట్టుబడి ఉండాలన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సి ఉందన్నారు.
తెలంగాణపై ఇప్పుడు జరగాల్సింది చర్చ కాదన్నారు. పరిష్కారమని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు రాష్ట్రంలో అన్ని పార్టీల నుండి పిలుపు వచ్చిందని ఆమె చెప్పారు. అమర్ సింగ్ సూచనల మేరకు తాను రాష్ట్రంలో ఏదో పార్టీలో చేరుతానని అన్నారు. అన్ని పార్టీల నుండి ఆహ్వానం వచ్చినా ప్రజలు మద్దతు ఉన్న పార్టీ వైపు వెళ్తానని ఆమె చెప్పారు.
జగన్ పార్టీలోకే జయప్రద
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును విమర్శించడం ద్వారా ఆమె కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. 2014లో రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తానని ఆమె పలుమార్లు చెప్పారు. రాష్ట్రానికి వస్తే టిడిపి లేదా జగన్ పార్టీలలో ఏదో ఒకదానినే ఆమె ఎన్నుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు బాబుపై విమర్శ చేయడంతో ఆమె జగన్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ పార్టీలోకి వెళితే ఎలా ఉంటుందని మీడియా ప్రశ్నిస్తే ఆమె బ్రహ్మండంగా ఉంటుందని చెప్పారు. అయితే 2014 వరకు సమయం ఉన్నందన ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఆమె వ్యాఖ్యలను బట్టి జగన్ పార్టీలోకి వెళ్లేందుకు ఆమె మానసికంగా సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!