ప్రమోషన్లు, వ్యాపారాల్లో లాభాల కోసం ఈ ఒక్క వాస్తును పాటించండి

రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నా బాస్ నుంచి గుర్తింపు లభించకపోవడం, ఆశించిన స్థాయిలో ప్రమోషన్లు రాకపోవడం చాలా మంది ఉద్యోగులను వేధించే సమస్య. అటు వ్యాపారస్తులు కూడా ఎంత పెట్టుబడి పెట్టినా లాభాలు రాక చతికిలపడుతుంటారు. అయితే, మన వైఫల్యాలకు కేవలం మన ప్రతిభే కారణం కాకపోవచ్చు! మనం రోజులో ఎక్కువ సమయం గడిపే ఆఫీస్ టేబుల్ లేదా వ్యాపార సంస్థలోని క్యాబిన్ డెస్క్ లో ఉండే 'వాస్తు దోషాలు' కూడా మన ఎదుగుదలను అడ్డుకోవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆఫీస్ టేబుల్ అనేది కేవలం ఫైళ్లు, లాప్‌టాప్ పెట్టుకునే స్థలం కాదు.. అది మన ఆలోచనలను, పనితీరును, మనకు వచ్చే అవకాశాలను ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన కేంద్రం.

కూర్చునే దిశ, స్థానం

పని చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశగా ఉండాలి. ఉత్తర దిశ ధనాధిపతి అయిన కుబేరుడి స్థానం కాబట్టి ఇది కొత్త వ్యాపార అవకాశాలను, లాభాలను ఇస్తుంది. తూర్పు దిశ సూర్యుడి స్థానం కాబట్టి ఇది లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను, ప్రమోషన్లను పెంపొందిస్తుంది. మీరు కూర్చునే సీటు వెనుక ఖాళీ స్థలం లేదా కిటికీ ఉండకూడదు. వెనుక వైపు బలమైన గోడ ఉండాలి. ఇది కెరీర్‌లో స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా, ఉన్నతాధికారుల మద్దతు లభించేలా చేస్తుంది.

Follow this one Vastu tips for promotion and business profits

అదృష్టాన్ని తెచ్చే వస్తువులు

టేబుల్‌పై కొన్ని వస్తువులను సరైన మూలల్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. క్రిస్టల్ గ్లోబ్ (వాయువ్యం): టేబుల్ వాయువ్య మూలలో దీనిని ఉంచి, రోజుకు ఒక్కసారైనా క్లాక్‌వైజ్ (సవ్యదిశలో) తిప్పడం వల్ల విదేశీ అవకాశాలు, కొత్త డీల్స్ వస్తాయి. లక్కీ బాంబూ ప్లాంట్ (ఆగ్నేయం): ఆగ్నేయం అగ్ని కోణం కాబట్టి, ఇక్కడ చిన్న వెదురు మొక్కను ఉంచితే పనిలో ఉత్సాహం పెరిగి, సంపద కలిసి వస్తుంది. క్రిస్టల్ పేపర్ వెయిట్ (ఈశాన్యం): దీనిని ఈశాన్య మూలలో ఉంచడం వల్ల ఒత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది.

వస్తువుల అమరిక (ఎడమ వైపునకే ప్రాధాన్యత)

మీ లాప్‌టాప్, కంప్యూటర్ లేదా ముఖ్యమైన ఫైళ్లను ఎల్లప్పుడూ టేబుల్‌కి ఎడమ వైపున మాత్రమే ఉంచాలి. వాస్తు ప్రకారం టేబుల్ ఎడమ భాగం బరువుగా ఉంటే కెరీర్ వృద్ధి వేగంగా ఉంటుంది. టేబుల్‌పై ఉన్న పెన్ స్టాండ్‌లో ఎల్లప్పుడూ బాగా పనిచేసే పెన్నులు మాత్రమే ఉండాలి. రాయకుండా ఆగిపోయిన, విరిగిపోయిన పెన్నులు నెగెటివ్ ఎనర్జీని కలిగిస్తాయి.

పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!

ఆఫీస్ డెస్క్ పై మనం చేసే కొన్ని నిర్లక్ష్యపు పనులు ఆర్థిక సంక్షోభానికి కారణమవుతాయి. వాటికి దూరంగా ఉండండి. టేబుల్‌పై పనికిరాని పేపర్లు, పాత బిల్లులు, ఖాళీ టిఫిన్ బాక్సులు లేదా దుమ్ము అస్సలు ఉండకూడదు. క్లీన్‌గా లేని టేబుల్ మీ ఆలోచనలను కూడా గందరగోళపరుస్తుంది. చాలా మంది టేబుల్ గ్లాస్ కింద దేవుళ్ల లేదా ఫ్యామిలీ ఫోటోలు పెడుతుంటారు. వాటిపై లాప్‌టాప్స్ పెట్టడం లేదా చేతులు ఆనించడం దోషం. ఫోటోలను ప్రత్యేకంగా చిన్న స్టాండ్ రూపంలో టేబుల్‌పై ఉంచడం మంచిది. అంచులు విరిగిన కప్పులు, పగిలిన గ్లాసులు లేదా పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను డెస్క్‌పై ఉంచడం వల్ల 'రాహు దోషం' ఏర్పడి, ఉద్యోగంలో ఆకస్మిక సమస్యలు, గొడవలు వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+