అఖిల్ 'లెనిన్' క్లైమాక్స్.. నాగార్జున షాకింగ్ రియాక్షన్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో హిట్టు కోసం పరితపిస్తున్న హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు. 1995 లోనే ఏడాదిన్నర వయసులో సిసింద్రీ సినిమాతో కెమెరా ముందుకు వచ్చారు అఖిల్. ఈ సినిమాలో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అప్పట్లోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. పెద్దయ్యాక 2014 లో మనం చిత్రం క్లైమాక్స్ లో అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. అఖిల్ ఎంట్రీకి థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఆ తర్వాత 2015 లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో అఖిల్ ది పవర్ ఆఫ్ జువా చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయం సాధించలేకపోయింది. కానీ అఖిల్ నటన, డ్యాన్స్ , ఫైట్స్ ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ చిత్రాలతో మెప్పించారు. కానీ ఇవేవీ ఆశించినంత విజయం సాధించలేక పోయాయి. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని కసి మీద ఉన్నారు అఖిల్.

అఖిల్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం లెనిన్.. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. జూన్ 26 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక లెనిన్ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. లెనిన్ ఫస్ట్ కాపీ ఇప్పటికే రెడీ అయినట్టు సమాచారం. లెనిన్ ఫస్ట్ కాపీ చూసి కింగ్ నాగార్జున్ ఫుల్ హ్యాపీ అయినట్లు తెలుస్తోంది.

Akhil Akkineni s Lenin Climax Stuns Nagarjuna Superstar s Shocking Reaction Goes Viral Akhil

ముఖ్యంగా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు లెనిన్ క్లైమాక్స్ ను తీర్చిదిద్దిన విధానం చాలా కొత్తగా అద్బుతంగా ఉందని నాగార్జున ప్రశంసించారట. దాంతో ఈసారి అఖిల్ కు హిట్టు గ్యారంటీ అని అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక లెనిన్ తర్వాత అక్కినేని అఖిల్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని టాక్ వినిపిస్తోంది. కానీ దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+