డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు.. వాహనదారుడి చెంప చెల్లుమనిపించిన పోలీస్ (వీడియో)

రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రత దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వీకెండ్స్ లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న వారి సంఖ్య అధికంగా నమోదవుతోంది. దాంతో పోలీసులు నగరం వ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిలో చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఉద్రిక్తత నెలకొంది.

Drunk Driving Test Turns Chaotic Police Officer Slaps Motorist Viral Video Sparks Outrage Drunk

ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్ష చేస్తున్న సమయంలో ఓ వాహనదారుడు పోలీసులను ఇబ్బంది పెట్టాడు. వారి ఓపికను పరీక్షించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన ట్రాఫిక్ పోలీస్ ఆ వాహనదారుడిని చెంపదెబ్బ కొట్టాడు. ఇక ఈ ఘటనతో ఇరువర్గాల మధ్య పెద్ద ఘర్షణకు దారితీసింది. ఈ వీడియో తీసిన వీడియోగ్రాఫర్ కొట్టకండి సార్.. వీడియో రికార్డ్ అవుతోంది. అని చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బ్రీత్ అనలైజర్ ను కొరకడం కాదు.. ఊదాలి.. అలాగే ఊదు అంటూ పోలీస్.. వాహనదారుడికి చెప్పాడు. కానీ ఆ వాహనదారుడు మాత్రం అందుకు వ్యతిరేకంగా పోలీస్ కు సహకరించలేదు. దాంతో చిర్రెత్తిపోయిన పోలీస్ అతడి చెంప చెల్లుమనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అయితే ట్రాఫిక్ పోలీస్ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల్ని కొట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. వాహనదారుడు తాగినప్పటికీ అలా కొట్టడం సరికాదని పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం ట్రాఫిక్ పోలీసును సమర్థిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో చాలామంది ఇలాగే పోలీసులను విసిగిస్తుంటారని చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+