వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య సయోధ్యకు రంగంలోకి కాంగ్రెస్ పెద్ద!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల మధ్య దూరం పెరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న రాఖీ పండుగ సందర్భంగా కూడా రాజకీయాలను పక్కనపెట్టి అన్నా చెల్లెళ్ళు కలవలేదు. షర్మిల జగన్ కు రాఖీ కట్టలేదు. రాజకీయ విభేదాలతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం రెండుగా చీలింది.

జగన్, షర్మిల ప్రచ్చన్న యుద్ధంపై చర్చ
గతంలో ఒక తాటి మీద నడిచిన అన్నా చెల్లెలు ఇప్పుడు రాజకీయంగా బద్ధ శత్రువులుగా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా షర్మిల ప్రధానంగా వైఎస్ జగన్ పాలనను టార్గెట్ చేసి జగన్ ను ఓడించాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసింది. ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న అన్నాచెల్లెళ్ల మధ్య దూరం ఇలాగే పెరుగుతుందా? లేదా వాళ్ళు భవిష్యత్తులో కలిసే అవకాశముందా అన్నది ప్రస్తుతం ఏపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

Is the Congress leader in the field of reconciliation between YS Jagan and YS Sharmila

జగన్, షర్మిల ఇద్దరూ ఇద్దరే
అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వైయస్ జగన్ వైఎస్, షర్మిల ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే అవకాశం లేనట్లుగా కనిపిస్తుంది. కానీ వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ప్రస్తుతం ప్రచారం సాగుతుంది. వైయస్ జగన్, వైయస్ షర్మిల ఇద్దరు ఎవరికి వారు హేమా హేమీలే.. 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేంత వరకు అన్నా చెల్లెలు అలుపెరగకుండా కష్టపడ్డారు.

అన్నా చెల్లెళ్ళ మధ్య పొలిటికల్ వార్
ఇక వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు మొదలై షర్మిల తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని పెట్టి కొంతకాలం కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో ఏపీ రాజకీయాలలో కాలు పెట్టిన షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కీలక బాధ్యతలతో అన్నపై పోరాటం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు షర్మిల జగన్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

జగన్, షర్మిల మధ్య సయోధ్యకు కాంగ్రెస్ పెద్ద యత్నం
ఒక రకంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిల కూడా ఓ కారణమయ్యారు.ఇక అటువంటి షర్మిల జగన్ ల మధ్య సయోధ్య కుదిర్చడానికి కాంగ్రెస్ పార్టీలోని ఓ పెద్దాయన ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది .షర్మిల వల్ల జగన్ కు, జగన్ కారణంగా షర్మిలకు నష్టం జరగకుండా ఇద్దరు రాజకీయాలలో కీలక భూమిక పోషించే విధంగా మధ్యే మార్గంగా వారిద్దరితో చర్చలు జరపాలని సయోధ్య కుదర్చాలని భావిస్తున్నారు.

జగన్, షర్మిల కలుస్తారా?
కాంగ్రెస్ పార్టీలోని ఓ పెద్దాయన ఈ మేరకు రెడీ అయినట్టు జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే షర్మిల జగన్ మధ్య ఏర్పడిన గ్యాప్ తగ్గుతుందా? వీరి మధ్య సయోధ్య కోసం యత్నించే ఆయన ఎవరు? అన్నా చెల్లెళ్ళు కలుస్తారా అన్నది మాత్రం అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తుంది..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+