ఆంధ్రప్రదేశ్‌లో అసలు ముఖ్యమంత్రి ఉన్నారా?: బొత్స నిప్పులు
హైదరాబాద్: రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. సీఎం చంద్రబాబు నాయుడు అండర్‌గ్రౌండ్‌లో ఉంటారా? అని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.
మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి నాలుగు రోజులు అవుతున్నా.. ముఖ్యమంత్రి ఎందుకు ఢిల్లీలో పోరాటం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజల ముందుకు చంద్రబాబు ఎందుకు రావడం లేదని నిలదీశారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు నిరసన తెలుపుతున్నారని, వారు మాటల్లో కాదు.. నిరసనను చేతల్లో చూపించాలని బొత్స సూచించారు.

నాలుగేళ్లు బీజేపీతో సహవాసం చేసి రాష్ట్రానికి ఏం మేలు చేశారని బొత్స ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అడిగిన ప్రశ్నలపై చంద్రబాబు కావాలంటే స్వయంగా సీబీఐ విచారణ జరిపించుకోవాలన్నారు.
చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. విభజన హామీల విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీపడే ప్రసక్తే లేదని, రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications