ఇది మార్షల్ ఆర్టా ? పవన్ ట్వీట్ లో పెట్టిన ఫోటోపై వైసీపీ మంత్రి సెటైర్.. !

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ రోజుకో విధంగా ట్వీట్లు చేస్తూ ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో విషయం గ్రహించిన వైసీపీ నేతలు పవన్ ట్వీట్ పెట్టినా, పత్రికా ప్రకటన చేసినా, బహిరంగంగా విమర్శలు చేసినా వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ఇదే క్రమంలో పవన్ పెట్టిన ఓ ట్వీట్ కు వైసీపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కౌంటర్ ఇచ్చారు.

స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పవన్ కళ్యాణ్.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీ కావడంతో దాన్ని వదిలిపెట్టేశారు. ఇది జరిగి 20 ఏళ్లు దాటిపోయాయి. అయితే తాజాగా మార్షల్ ఆర్ట్స్ ఎందుకో ఆయనకు గుర్తుకొచ్చింది. దీంతో ట్విట్టర్ లో ఓ ఫొటో ఫోజు పెట్టి 20 ఏళ్ల తర్వాత తిరిగి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ మొదలుపెడుతున్నా అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు, నేతలు కూడా ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ స్వాగతిస్తున్నారు.

 is this martial art ?.. ysrcp minister gudivada amarnath satire on pawan kalyan tweet

అయితే దీనిపై వైసీపీకి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇవాళ కౌంటర్ వేశారు. పవన్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఇది మార్షల్ ఆర్ట్సా పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు. చేతిలో ఓ పదునైన కత్తి వంటి ఆయుధం పట్టుకుని పవన్ ఇచ్చిన ఫోజును ఎద్దేవా చేస్తూ ఇది మార్షల్ ఆర్ట్సా అని ప్రశ్నించారు. మంత్రి కౌంటర్ తో పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ తిరిగి ప్రారంభిస్తున్నట్లు సమాచారమిస్తూ పెట్టిన ఈ ఫోటోలో ఆయన ఇచ్చింది మార్షల్ ఆర్ట్స్ యాంగిలా లేక మరేదైనా అయి ఉంటుందా అన్న చర్చ సాగుతోంది.

 is this martial art ?.. ysrcp minister gudivada amarnath satire on pawan kalyan tweet
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+