ఇస్రో.. బిగ్గెస్ట్ మిషన్: అంతా సిద్ధం
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చరిత్రలో 2023 సంవత్సరం చిరస్థాయిగా నిలిచిపోనుంది. చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్1 మిషన్లను విజయవంతం చేసింది ఇస్రో. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 శాటిలైట్‌ను అంతరిక్ష ప్రయాణం సజావుగా సాగుతోంది. త్వరలో అది లాగ్రాంజ్ పాయింట్‌ను చేరుకోనుంది.
ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు ఈ రెండింటి వద్దే ఆగట్లేదు. మరో సంచలన మిషన్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. అదే- గగన్‌యాన్. మానవ సహిత ప్రయోగం ఇది. మనుషులను అంతరిక్షంలోకి పంపించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్. 2024 మార్చి నాటికి ఇది కార్యరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ మిషన్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్‌ను చేపట్టనుంది ఇస్రో. మానవ సహిత ప్రయోగంలో ఇది తొలి అడుగు. ఈ టెస్ట్ విజయవంతమైతే- ఇక మానుషులను అంతరిక్షంలోకి పంపిస్తుంది. ఈ ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ నేడే. ఇంకాస్సేపట్లో ఈ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది.
ఈ ప్రయోగం కోసం జీఎస్ఎల్వీ ఎంకే 3 రాకెట్‌ను వినియోగించనుంది. రాకెట్ క్రయోజెనిక్ ఇంజిన్ సామర్థ్యాన్ని ఇస్రో పరీక్షించింది.
గగన్‌యాన్‌లో భాగంగా మనుషులను లో- ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెడుతుంది ఇస్రో. భూఉపరితలంపై నుంచి 400 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్తారు. అయిదు నుంచి ఏడు రోజుల పాటు అక్కడే గడుపుతారు.
#WATCH | Visuals from Satish Dhawan Space Centre in Sriharikota, Andhra Pradesh as Indian Space Research Organisation (ISRO) will conduct Gaganyaan’s First Flight Test Vehicle Abort Mission-1 (TV-D1).#Gaganyaan pic.twitter.com/rEMqTr9sJt
— ANI (@ANI) October 21, 2023
క్రూ మాడ్యుల్ అంటే.. మనుషులను తీసుకెళ్లడానికి వీలుగా ఉండే క్యాబిన్, సర్వీస్ మాడ్యుల్ అంటే.. రెండు లిక్విడ్ ప్రొపెల్లంట్ ఇంజిన్స్‌ను పేలోడ్స్‌గా పంపిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తరువాత మానవ సహిత మిషన్‌ను చేపట్టిన నాలుగో దేశంగా నిలుస్తుంది భారత్.
మనుషులను అంతరిక్షంలోకి పంపించడం.. మళ్లీ వారిని విజయవంతంగా భూమిపైకి తీసుకుని రావడం, అంతరిక్ష పరిశోధన కేంద్రంలో సేవలను అందించడం.. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమక్ష సమావేశాన్ని నిర్వహంచారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్‌ను నెలకొల్పాలని, 2,040 నాటికి భారతీయుడిని చంద్రునిపైకి పంపించాలని సూచించారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications