ఐటీ శాఖకు నోటీసు: ఏపీ ఐటీ దాడులపై సీఎం రమేష్ ఆరా తీసిన మూడ్రోజుల్లోనే.. సోదాలపై ఏమన్నారంటే
కడప/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) సోదాలు కలకలం రేపుతున్నాయి. అంతకుముందు మరో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కంపెనీల్లో సోదాలు జరిగాయి. ఇప్పుడు సీఎం రమేష్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి.
కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని సీఎం రమేష్ నివాసంతో పాటు కడప, విజయవాడ, హైదరాబాదులలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. దీనిపై సీఎం రమేష్ ఘాటుగా స్పందించారు. తన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు.

ఐటీ దాడులు ఎక్కడ, ఎందుకు.. పీఏసీ సభ్యుడిగా ఐటీ శాఖకు నోటీసు
ఐటీ శాఖ నోటీసులు ఇచ్చాకే, ఈ సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు, దేశంలో ఎక్కడ, ఎందుకు ఐటీ దాడులు చేస్తున్నారని, అలాగే ఏపీలో దాడుల వివరాలకు ఇవ్వాలంటూ పీఏసీ సభ్యుడిగా సీఎం రమేష్ ఐటీ శాఖకు నోటీసులు కూడా ఇచ్చారు. సీఎం రమేష్ ఐటీ శాఖకు ఈ నోటీసులు ఇచ్చిన మూడ్రోజుల తర్వాత ఆయన కార్యాలయం, ఇళ్లపై సోదాలు జరిగాయి.

చెల్లించిన ఐటీ కంటే ఎక్కువ ఆస్తులు
హైదరాబాద్‌లోని రమేష్ ఇంట్లో 10 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు 25 నుంచి 30 చోట్ల ఏకకాలంలో వంద మంది ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన చెల్లించిన ఐటీ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించడం వల్లే ఈ సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

తప్పుచేయలేదు, భయపడను
ఆదాయపన్ను శాఖ దాడులపై సీఎం రమేష్ స్పందించారు. ఐటీ దాడులకు ఎట్టి పరిస్థితుల్లోను భయపడే ప్రసక్తి లేదని ఢిల్లీలో ఉన్న ఆయన చెప్పారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలాగే దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల వెనుక ప్రత్యేక అజెండా ఉందని చెప్పారు.

ఇంట్లో లేని సమయంలో దాడులా, మీడియా సమక్షంలో జరగాలి
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయని సీఎం రమేష్ ఆరోపించారు. మీడియా సమక్షంలో ఐటీ దాడులు చేయాలని కోరుతున్నానని చెప్పారు. నేను ఇంట్లో లేని సమయంలో ఇలా దాడులు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. కాగా, కడప ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్ కేంద్రానికి వంద రోజులు గడువు పెట్టారు. ఆ గడువు పూర్తయింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications