కరోనా విషయంలో వాస్తవాలను తొక్కి పెట్టటం మంచిది కాదు : జగన్ కు చంద్రబాబు లేఖ
ఏపీలో కరోనా మహమ్మారి ఊహించని విధంగా ప్రబలుతుంది . ఇప్పటికి 132 కి చేరింది ఏపీలో కేసుల సంఖ్య. ఇక ఈ నేపధ్యంలో మాజీ సీఎం చంద్రబాబు తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చెయ్యాలని సూచించారు. సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు కరోనా అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని హితవుపలికారు.
ఇక ఇప్పటికే ఏపీలో కేసులు పెరిగిపోయాయని వైరస్ వేగం పుంజుకుందని పేర్కొన్న చంద్రబాబు, కరోనా నివారణను సవాల్‌గా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. పాజిటివ్ కేసులను దాచిపెడుతున్నారన్న ప్రచారం ఉందని, స్థానిక వాస్తవాలను తొక్కిపెట్టడం మంచిదికాదని హితవుపలికారు. ఏపీలో ల్యాబ్‌లు పెంచాలని, ఎక్కువ పరీక్షలు చేయాలని, ఇక ఢిల్లీ నిజాముద్దీన్ సభకు వెళ్లి వచ్చిన వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని, కరోనా కేసులు పెరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఉపాధి కోల్పోయిన పేదలు పస్తులు ఉండకుండా అన్న క్యాంటీన్లు తెరిచి వారిని ఆదుకోవాలని పేర్కొన్నారు చంద్రబాబు . ఓ వైపు ప్రభుత్వం భౌతిక దూరం పాటించాలని చెబుతూనే రేషన్ పేరుతో జనాల్ని ఒకే చోటుకు చేర్చడం సరికాదన్నారు. రేషన్ ఇళ్లకే వెళ్లి ఇచ్చి రావాలని సూచించారు. వైద్యులు, సిబ్బందికి పీపీఈలు అందజేయాలని, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం సరికాదని చంద్రబాబు చెప్పారు.శరవేగంగా విస్తరిస్తున్న ఏడు రాష్ట్రాల్లో ఏపీని కూడా చేర్చారని, ఇది మరింత ఆందోళనకరమని పేర్కొన్న చంద్రబాబు జగన్ కు కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చెయ్యాలని వరుస లేఖలు రాస్తున్నారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications