ఇది చదువుల సమయం: దేశంలో టాప్ విద్యాసంస్థలు ఇవే!!

చదువుల సమయం మొదలైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఏ యూనివర్సిటీ మంచిది? ఏ కళాశాల మంచిది? పిల్లలను ఏ కోర్సులో జాయిన్ చేయాలి? ఏ యూనివర్సిటీలో జాయిన్ చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది? అని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక అటువంటి వారి కోసమే దేశంలోని టాప్ విద్యాసంస్థల సమాచారం అందిస్తున్నాం.

విద్యా సంస్థలకు సంబంధించి తాజాగా విద్యాశాఖ ర్యాంకులను ప్రకటించింది. వివిధ కేటగిరీల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యాసంస్థలు టాప్ విద్యా సంస్థలుగా గుర్తింపును సంపాదించాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి టాప్ యూనివర్సిటీ గా గుర్తించబడింది. అంతేకాదు రీసెర్చ్ విభాగంలోనూ ఐఐఎస్సి టాప్ పొజిషన్లో నిలిచింది.

Its Time for Education: Top Educational Institute in India; These are the latest rankings!!

ఇంజనీరింగ్ కు సంబంధించి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీ మద్రాస్ టాప్ పొజిషన్ లో నిలిచింది. మేనేజ్మెంట్ విభాగంలో గుజరాత్ అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం టాప్ పొజిషన్ లో ఉంది. మెడికల్ కళాశాలకు సంబంధించి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.

అగ్రికల్చర్ విభాగంలో న్యూ ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టాప్ పొజిషన్ లో ఉంది. ఇన్నోవేటివ్ రంగంలో ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఫార్మసి విభాగంలో తెలంగాణ హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ నైపర్ టాప్ పొజిషన్ లో ఉంది.

ఆర్కిటెక్చర్ విభాగానికి సంబంధించి ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) టాప్ పొజిషన్లో ఉంది. డెంటల్ లో తమిళనాడు చెన్నై లోని సవీత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ ప్రథమ స్థానంలో నిలిచింది. లా కాలేజ్ లో కర్ణాటక బెంగుళూరు లోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ టాప్ స్థానంలో ఉంది.

ఇక న్యూఢిల్లీలోని మిరండా హౌస్ కళాశాల ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. మొత్తంగా ఈ విద్యాసంస్థలలో తమిళనాడు చెన్నై లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఓవరాల్ చాంపియన్ గా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+