ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ శుభవార్త- వాటి విలువ రూ.10,000 కోట్లు: 12వ పీఆర్సీకీ..

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ఈ సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ జగన్- ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, సచివాలయ ఉద్యోగ సంఘాలు, వైఎస్ఆర్టీఎఫ్ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు.

ఉద్యోగ సంఘాల నేతల్లో..

ఉద్యోగ సంఘాల నేతల్లో..

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ప్రభుత్వ, ఉపాధ్యాయ, సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బండి శ్రీనివాస రావు, వెంకట్రామిరెడ్డి, సత్య సులోచన, శ్రీకృష్ణ.. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. సీనియర్ ఐఎఎస్ అధికారులు ముఖ్యమంత్రిని కలిశారు.

 డిమాండ్ల పరిష్కారానికి..

డిమాండ్ల పరిష్కారానికి..

అనంతరం- బండి శ్రీనివాస రావు విలేకరులతో మాట్లాడారు. అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లను పరిష్కరించడానికి వైఎస్ జగన్ అంగీకరించారని చెప్పారు. బకాయిలను విడుదల చేయడానికి తక్షణ చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిల విలువ 10,000 కోట్ల రూపాయల వరకు ఉందని, వాటిని దశలవారీగా చెల్లించడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని చెప్పారు.

రూ.10,000 కోట్లు..

రూ.10,000 కోట్లు..

సంక్రాంతికి ఒక డీఏను విడుదల చేయడంతో పాటు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరంభం అయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో బకాయిలను విడుదల చేస్తానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారని వివరించారు. రెండు సంవత్సరాలుగా తమకు రావాల్సిన జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, మెడికల్ లీవ్స్, లీవ్ ఎన్‌క్యాష్ మెంట్స్ రూపంలో ప్రభుత్వం నుంచి 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని బండి శ్రీనివాస్ రావు అన్నారు.

యాక్షన్ ప్లాన్..

యాక్షన్ ప్లాన్..

ఈ బకాయిల విడుదల ప్రక్రియను తక్షణమే చేపట్టాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామని బండి శ్రీనివాస్ రావు అన్నారు. దీనికి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని, దీనిపై కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. 12వ పే రివిజన్ కమిటీని ఏర్పాటు చేయడానికి కూడా వైఎస్ జగన్ అంగీకరించారని పేర్కొన్నారు.

 డీఏ, బకాయిలు..

డీఏ, బకాయిలు..

2018 జులై 1వ తేదీ నుంచి తమకు రావాల్సిన డీఏ, బకాయిలను కూడా క్లియర్ చేయాలని తాము జగన్ ను కోరామని బండి శ్రీనివాస రావు చెప్పారు. గత ఏడాది జనవరి 1, జులై 1 నుంచి చెల్లించాల్సిన రెండు బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.

ఈ సంక్రాంతికే..

ఈ సంక్రాంతికే..

దీనిపై జగన్ సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ సంక్రాంతికి ఒక డీఏను విడుదల చేయడానికి అంగీకరించారని చెప్పారు. ఇక ఏప్రిల్ నుంచి మిగిలిన బకాయిలన్నింటినీ విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీని పట్ల తాము ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+