Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రి ఆది పై జ‌గ‌న్ ఫైర్ : మిమ్మ‌ల్నే న‌మ్ముకున్నాను: జ‌మ్మ‌ల‌మ‌డుగులో జ‌గ‌న్ ఉద్వేగం..!

వైసిపి అధినేత జ‌గ‌న్ జ‌మ్మ‌ల‌మడుగు లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉద్వేగానికి గుర‌య్యారు. త‌నకు పెద్ద నాయ‌కులు ఎవ‌రూ మ‌ద్ద‌తుగా లేర‌ని..నాన్న ఇచ్చిన ఈ కుటుంబ‌మే త‌న‌కు అండ అంటూ చెప్పుకొచ్చారు. జ‌మ్మ‌ల మడుగు లో మిమ్మ‌ల్నే న‌మ్ముకున్నానంటూ వారి మ‌ద్ద‌తు పొందే ప్ర‌య‌త్నం చేసారు. ఆదినారాయణ రెడ్డి మీద ఫైర్ అయ్యారు.

వారిద్దరి కార‌ణంగా క‌క్ష్య‌లు..కార్ప‌ణ్యాలు..

వారిద్దరి కార‌ణంగా క‌క్ష్య‌లు..కార్ప‌ణ్యాలు..

క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు లో వైసిపి అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. స‌భ ప్రారంభంలోనే ఇక్క‌డ ఇన్‌ఛార్జ్ గా ఉన్న వివేకా మృతికి సంతాపంగా నిమిషం పాటు మౌనం పాటించారు. క‌డ‌ప బిడ్డ‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరారు. గ‌తంలో టిడిపి..కాంగ్రెస్ లో ఉన్న ఇద్ద‌రు నేత‌లు రాజ‌కీయ స్వార్దం కోసం ఇప్పుడు ఒక్క చోట‌కు చేరార‌ని చెప్పుకొచ్చారు. వీరిద్ద‌రి కార‌ణంగా నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రామాల్లో గ్రూపులు..ముఠాలు..గొడ‌వ‌లు..క‌క్ష్య‌లు ఏర్ప‌డ్డాయ‌ని .. ఎంతో మంది ఈ ఇద్ద‌రి కోసం పొడుచుకున్నార‌ని..చంపుకున్నార‌ని వివ‌రించారు. త‌న‌కు పెద్ద పెద్ద నేత‌లు ఎవ‌రూ అండ‌గా లేర‌ని..తాను మిమ్మ‌ల్నే న‌మ్ముకున్నాన‌ని భావోద్వేగానికి గుర‌య్యారు. వైసిపి ని గెలిపించాల్సిన బాధ్య‌త మీదే అని అభ్య‌ర్దించారు. జ‌మ్మ‌ల మ‌డుగు అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని హామీ ఇచ్చారు.

మంత్రి ఆది పై ఫైర్‌..

మంత్రి ఆది పై ఫైర్‌..

మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి పై జ‌గ‌న్ ఫైర్ అయ్యారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు స‌భ‌లో ఆది గురించి ప్ర‌స్తావిస్తూ..ఇక్క‌డి నుండి వైసిపి ఎమ్మెల్యేగా గెలిచి టిడిపిలోకి ఫిరాయించి మంత్రి పద‌వి అనుభ‌విస్తున్నార‌న్నారు. మాడేళ్లుగా మంత్రి గా ఉండి రాజోలి గురించి ప‌ట్టించుకోకుండా.. ప్యాకేజీలు..క‌మిష‌న్ల కోసం ఆరాట‌ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు లో ఎంతో మంది కేశ‌వరెడ్డి విద్యా సంస్థ‌ల బాధితులు ఉన్నార‌ని..కేశ‌వ రెడ్డి మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డికి వియ్యంకుడు అని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. కేశ‌వ రెడ్డి బాధితుల‌ను ప‌ట్టించుకోకుండా..ఆయ‌న వియ్యంకుడిని చంద్ర‌బాబు ఎలా మం త్రి ని చేస్తార‌ని ప్ర‌శ్నించారు. అదే విధంగా అగ్రిగోల్డ్ బాధితుల‌ను చెల్లించాల్సి మొత్తాన్ని తాము అధికారంలోకి వ‌స్తే తొలి బ‌డ్జెట్‌లోనే ప్ర‌తిపాదించి బాధితుల‌కు అంద‌చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

మూడేళ్ల లో క‌డ‌ప స్టీల్ ఫ్యాక్ట‌రీ..

మూడేళ్ల లో క‌డ‌ప స్టీల్ ఫ్యాక్ట‌రీ..

తాను అధికారంలోకి వ‌స్తే తొలి ఆరు నెల‌ల్లోనే క‌డ‌ప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాప‌న చేస్తాన‌ని..మూడేళ్ల‌లోనే ఫ్యాక్టరీ నిర్మా ణం పూర్తి చేస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం క‌డ‌ప స్టీల్ ఫ్యాక్టరీ కేంద్ర‌మే నిర్మించాల్సి ఉం ది. అయితే సాంకేతిక కార‌ణాల‌తో కేంద్ం తాత్సారం చేస్తోంది. దీంతో..కొద్ది రోజుల క్రితం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌డ‌ప లో స్టీల్ ఫ్యాక్టరీ కోసం శంకుస్థాప‌న చేసారు. ఆ త‌రువాత దాని పై ఎటువంటి చ‌ర్చ జ‌ర‌గలేదు. దీంతో, ఇప్పుడు ఎన్నిక‌ల వేళ జ‌గ‌న్ దీని పై హామీ ఇచ్చారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో టిడిపి తో పాటుగా ఎల్లో మీడియా త‌మ పై బుర‌ద చల్ల‌టానికి సిద్దంగా ఉంద‌ని..ప్ర‌తీ ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జ‌గ‌న్ సూచించారు. తాను అధికారంలోకి వ‌స్తే అ మ‌లు చేసే న‌వ‌ర‌త్నాల‌ను మ‌రో సారి జ‌గ‌న్ వివ‌రించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+