మోడీకి ప్రశంస, నితీష్ దార్లో: జగన్ హావభావం(పిక్చర్స్)

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. తాను లౌకికవాదినని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాదిరిగా తాను ఏ విషయంలోను యూ టర్న్ తీసుకోనన్నారు.

మోడీని ఒక అడ్మినిస్ట్రేటర్‌గా అభినందిస్తానని, తాను ఈ తరం మనిషినని, శాంతి, అభివృద్ధిని కోరుకునే మనిషినని చెప్పారు. ఏ మతస్తులైనా ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చనిపోతామని, ఇక్కడే పుట్టి చనిపోయే వారిలో అభద్రతా భావమెందుకన్నారు. మతం అనేది వ్యక్తిగతమన్నారు.

కమ్యూనిస్ట్, జనతాదళ్(యు) వంటి లౌకిక పార్టీలు ఏం చేస్తాయో తాను అదే చేస్తానని చెప్పారు. పొత్తులపై తాను ఇప్పుడే తొందరపడనన్నారు. విభజన అంశంపై మాట్లాడుతూ.. తాను సమైక్య లేఖపై తొలి సంతకం చేస్తానన్నారు. హైదరాబాదులో సమర శంఖం పూరీస్తామని, కేబినెట్ నోట్‌కు ముందే భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు.

గవర్నర్‌ను కలిసిన జగన్

గవర్నర్‌ను కలిసిన జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇస్తున్న దృశ్యం.

జగన్, ఇతర నేతలు

జగన్, ఇతర నేతలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర నేతలు సోమవారం గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.

విలేకరులతో

విలేకరులతో

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

జగన్‌తో టి, సీమాంధ్ర నేతలు

జగన్‌తో టి, సీమాంధ్ర నేతలు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పక్కన తెలంగాణ ప్రాంత నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇతర నేతలు.

హావభావాలు

హావభావాలు

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాలనను పొగిడిన జగన్ తాను లౌకికవాదినని చెప్పారు. ఆ సమయంలో ఆయన హావభావాలు.

జగన్

జగన్

బిజెపి నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాలనను పొగిడిన జగన్ తాను లౌకికవాదినని చెప్పారు. ఆ సమయంలో ఆయన హావభావాలు.

వైయస్ జగన్

వైయస్ జగన్

బిజెపి నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాలనను పొగిడిన జగన్ తాను లౌకికవాదినని చెప్పారు. జెడి(యు), కమ్యూనిస్ట్ పార్టీల దారిలో నడుస్తానని చెప్పారు.

సమావేశం అనంతరం వెళ్తూ

సమావేశం అనంతరం వెళ్తూ

పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం అనంతరం వెళ్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+