పీవీ సింధుకు జగన్ నజరానా- వైజాగ్‌లో అకాడమీకి రెండెకరాలు
ఏపీకి చెందిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు జగన్ సర్కార్ నజరానా ప్రకటించింది. రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా విశాఖలో ఆమెకు రెండెకరాల స్ధలం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఈ స్ధలంలో అకాడమీ ఏర్పాటు చేయనున్నారు.
విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాలు కేటాయించింది. విశాఖ గ్రామీణ మండల పరిధిలోని చినగదిలిలో 72/11, 83/5, 83/6 సర్వే నంబర్లలో పశు సంవర్థకశాఖకు చెందిన మూడు ఎకరాల్లో రెండు ఎకరాలను క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు.. ఒక ఎకరాన్ని వైద్య ఆరోగ్యశాఖకు బదలాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఆ రెండు ఎకరాలను పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ కోసం ఇస్తుంది. అకాడమీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మూడేళ్ల కాలానికి ఐటీ రిటర్నులు సమర్పించడంతో పాటు నిబంధనల ప్రకారం మిగతా షరతులన్నీ పూర్తి చేశాక ఆ భూమిని పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి బదలాయిస్తారు.

బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి స్థలం కేటాయించిన సీఎం జగన్‌కు పీవీ సిందు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాభివృద్ధి కోసం సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని, విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ లేనందున అక్కడ అత్యున్నత స్థాయి మౌలిక వసతులతో అకాడమీ ఏర్పాటు చేయాలని భావించినట్లు సింధు తెలిపారు. కరోనా మహమ్మారి తగ్గగానే అకాడమీ నిర్మాణం పనులు మొదలవుతాయని వెల్లడించారు.. తొలి దశలో అకాడమీ నిర్మిస్తామని, తర్వాతి దశలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు ప్రతిపాదన ఉందన్నారు. తానింకా ఆడుతున్నానని, ఆట నుంచి రిటైరైన తర్వాత అకాడమీలో శిక్షణ బాధ్యతలు చేపడతానని సింధు తెలిపారు.. ప్రభుత్వం అడిగిన అన్ని వివరాలు త్వరలోనే అందజేస్తామని తెలిపారు.
Recommended Video
-
విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications