జగన్ సర్కార్ కీలక నిర్ణయం-పేద విద్యార్ధులకు 25 శాతం ఫ్రీ సీట్లు-వచ్చే విద్యాసంవత్సరం నుంచి
ఏపీలో విద్యాహక్కు చట్టం కింద పేదలకు ఇవ్వాల్సిన ఉచిత సీట్లను కేటాయించకపోవడంపై హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ పై జగన్ సర్కార్ కీలక హామీ ఇచ్చింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని హైకోర్టుకు తెలిపింది. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చినా ఈ నిర్ణయం అమలు కాకపోవడంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఏపీలోని ప్రైవేటు విద్యాసంస్ధల్లో నిరుపేద విద్యార్ధులకు సీట్ల కేటాయింపు చేయకపోవడంపై హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వం వివరణ కోరింది. దీనిపై స్పందించిన వైసీపీ సర్కార్.. హైకోర్టుకు ఇవాళ వివరణ ఇచ్చింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పేదలకు సీట్లపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 25శాతం సీట్లు కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో పేదలకు సీట్లు ఇవ్వాలంటూ.. న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈ విచారణ జరిగింది.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్ధులకు ప్రైవేటు విద్యాసంస్ధల్లో సైతం ఉచిత విద్య అందేలా రాష్ట్రాలు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ప్రభుత్వాలు విద్యాసంవత్సరాన్ని సైతం అతి కష్టం మీద కొనసాగిస్తున్నాయి. దీంతో పేదలకు ఉచిత సీట్ల కేటాయింపు సాధ్యం కాలేదు. దీంతో వచ్చే ఏడాది నుంచి సీట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ ఏడాది నుంచే దీనిని అమలు చేయాలని పిటిషనర్ కోరగా.. ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నందున వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో హైకోర్టు దీనిపై సంతృప్తి వ్యక్తం చేసింది.
-
తెలంగాణా విద్యార్థులకు గుడ్ న్యూస్.. మధ్యాహ్న భోజనంలో చేపలు! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications