ఏపీలో మెడికల్ కాలేజీలపై జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్..
ఏపీలో వైద్యారోగ్య రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వైసీపీ సర్కార్ మెడికల్ కాలేజీల నిర్మాణం, పోస్టుల భర్తీతో పాటు పలు చర్యలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం
తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 17 కొత్త కాలేజీలు ఏర్పాటు చేస్తామని పదే పదే చెబుతోంది. ఇందులో ఐదు కాలేజీల్ని ఈ ఏడాదే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్యారోగ్యమంత్రి విడదల రజనీ ఇవాళ ప్రకటించారు.
రాష్ట్రంలోని విజయనగరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, రాజమండ్రిలో ఐదు మెడికల్ కాలేజీలని ప్రభుత్వం ప్రారంభించబోతోంది. వీటిలో మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఈ కాలేజీల్లో ఆగస్టు నుంచి సీట్లు భర్తీ చేస్తామని మంత్రి రజనీ ఇవాళ వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచి వీటిలో క్లాసులు కూడా ప్రారంభమవుతాయన్నారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 462 మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

రాష్ట్రంలో గత వందేళ్లలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే తాము అధికారంలోకి రాగానే 17 కాలేజీలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి విడదల రజనీ తెలిపారు. ఇదే క్రమంలో ఈ ఏడాది ఐదు కాలేజీలు ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి రజనీ పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వంటి పథకాలు ఇందులో భాగమేనన్నారు.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పాటు వైద్యారోగ్య రంగంలో పోస్టుల భర్తీని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి రజనీ తెలిపారు. నాలుగేళ్లలో 49 వేల పోస్టుల్ని తమ శాఖలో భర్తీ చేసినట్లు ఆమె వెల్లడించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని పోస్టుల్ని ఏ ప్రభుత్వం కూడా భర్తీ చేయలేదని ఆమె పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications