నేను విన్నాను - నేను ఉన్నాను : మహేష్ కు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!!

మహేష్ బాబు అభిమానులు భారీ అంచనాలతో నిరీక్షిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా కు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అనౌన్స్ చేసింది. 'స‌ర్కారువారి పాట' సినిమా టికెట్ల రేటు పెంపున‌కు ఏపీ స‌ర్కారు అనుమ‌తి ఇచ్చింది. టికెట్‌పై రూ.45 పెంపున‌కు అనుమ‌తి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. పది రోజుల పాటు పెరిగిన రేట్ల‌తోనే టికెట్లు అమ్ముకొనేందుకు వెసులు బాటు కలిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 10 రోజుల పాటు టికెట్ల‌పై రూ.45 మేర‌ పెంచుకొనేందుకు అవకాశం ఏర్పడింది.

ఏపీలో కొత్త సినిమా పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం... రాథే శ్యామ్ మూవీ నుంచి టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇస్తూ వచ్చింది. తాజాగా ఆచార్య సినిమాకు సైతం అనుమతి జారీ చేసింది. ఇక, ఇప్పుడు స‌ర్కారువారి పాట సినిమా యూనిట్ కూడా ఏపీ ప్ర‌భుత్వాన్ని టికెట్ల రేట్ల పెంపున‌కు అభ్య‌ర్థించింది. ఈ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించిన ఏపీ స‌ర్కారు అనుమతి మంజూరు చేసింది. ఈ సినిమాలో సీఎం జగన్ డైలాగ్ నేను విన్నాను - నేను ఉన్నాను అనే డైలాగ్ అటు సినిమా ఇండస్ట్రీల..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది.

JAgan Govt permitted to hike Mahesh movie sarkar vari pata ticket rates hike

ఇక, మహేష్ బాబు నటన మరో స్థాయికి చేరిందనేలా ఈ సినిమా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సా యాత్రం భారీగా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్‌. అయితే, ప్రతీ సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించి రెమ్యునరేషన్లతో సంబంధం లేకుండా వంద కోట్ల బడ్జెట్ దాటితే ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇస్తోంది. అదే విధంగా కొత్తగా నిర్మించే సినిమాలు 20 శాతం షూటింగ్స్ ఏపీలో నిర్వహించాలని ప్రభుత్వం కొత్త కండీషన్ పెట్టింది. కానీ, ఈ సినిమా షూటింగ్ ఈ నిబంధనలకు ముందే పూర్తి చేసారు. ఇప్పుడు, ప్రభుత్వ విధానం మేరకు అన్ని పత్రాలు అందించటంతో..సినిమా టికెట్ ధర పెంపుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+