వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్!!
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఎన్నికల వ్యూహాలపైనే కాదు పాలనలో కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకపక్క ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటూనే మరోపక్క పాలనలో తన మార్క్ చూపిస్తూ భవిష్యత్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచే క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు.
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తమను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్న వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్లకు ఇప్పటివరకు 5000 రూపాయలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం వారికి మరింత ప్రోత్సాహక నగదు ఇచ్చేందుకు రెడీ అయింది. ఇంటింటికి రేషన్ పంపిణీ పర్యవేక్షణకు ప్రోత్సాహకంగా 750 రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది.

ఈ నెలలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పౌరసరఫరాల శాఖకు సంబంధించి సమీక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటింటికి రేషన్ పంపిణీలో విలేజ్ వాలంటీర్లను మరింత భాగస్వాములను చేయడం కోసం 750 రూపాయల ప్రోత్సాహకాన్ని అందించాలని నిర్ణయించారు. అయితే ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి రేషన్ పంపిణీలో విలేజ్ వాలంటీర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఈ ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ మొత్తాన్ని ప్రతినెల పౌరసరఫరాల శాఖ ద్వారా వేరేగా వాలంటీర్లకు అందించటానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఏపీలో వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి నేరుగా ప్రభుత్వ పథకాలు, వివిధ రకాల సేవలు అందడం కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనప్పటికీ జగన్ సర్కార్ వాలంటీర్ల వ్యవస్థను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications