వైసీపీకి రివర్స్ బటన్
ఏపీలో ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు వెలువడుతున్న ఫలితాల్లో కూటమి నేతలు స్పష్టమైన అధిక్యంలో నిలిచారు. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, కీలక నేతలు ఓటమి అంచునా నిలిచారు. ఏపీ మంత్రులుగా ఉన్న వారంతా ప్రస్తుతానికి వెనకంజులోని ఉన్నారు ఓటమి దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. రౌండ్ల వారిగా వెలువడుతున్న ఫలితాలను చూస్తే ఇది అర్థమవుతుంది. వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
దీంతో ఏ స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది అనేది రౌండ్ల వారిగా వెలువడుతున్న ఫలితాలు నిరూపిస్తున్నాయి.గతంలో ఎప్పుడు లేని విధంగా, ఏ ప్రభుత్వం అమలు చేయని స్థాయిలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని, నేరుగా ప్రజలకే సొమ్ములు అందే విధంగా బటన్ నొక్కామని , ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా జనాలు బటన్ నొక్కుతారని జగన్ అంచనా వేశారు. అయితే జనాలు మాత్రం టీడీపీ కూటమి పార్టీలకే మద్దతుగా బటన్ నొక్కినట్లుగా అర్థం అవుతోంది. ఇప్పుడు రౌండ్ల వారీగా వెలువడుతున్న ఫలితాలు చూస్తే ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుందనే సంకేతాలు వెలువడతున్నాయి.

పెద్ద ఎత్తున అమలు చేసిన సంక్షేమ పథకాలు తమను కాపాడుతాయని, భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని జగన్ వేసిన అంచనా తలకిందులు అవ్వబోతున్నట్లుగానే పరిస్థితి ఉంది 20 ఏళ్లుగా టీడీపీ గెలవని నియోజకవర్గం ఇప్పుడు ఆ పార్టీకి అధిపత్యం వస్తుండడం చర్చనీయాంశంగా మారింది . మహిళలు , పురుషులు , ఉద్యోగులు ఇలా అంతా వైసీపీకి వ్యతిరేకంగానే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నట్లుగా ఎన్నికల కౌంటింగ్ లో రౌండ్ల వారీగా వెలువడుతున్న ఫలితాలు నిరూపిస్తున్నాయి.ఏది ఏమైనా వైసీపీ అంచనాలు తారుమారు అయ్యేలాగే పరిస్థితి కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications