పార్టీ వీడినా నష్టం లేదు..బాలినేనిపై తేల్చేసిన జగన్..?
మాజీ మంత్రి ,వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీకి, అధినేత జగన్‌కు పెద్ద తలనొప్పిగానే మారింది.రెండోసారి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి నుంచి తొలగించిన సమయంలోనే బాలినేని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే జగన్ బుజ్జగించడంతో బాలినేని వెనక్కి తగ్గారు. ఎన్నికల సమయంలో కూడా బాలినేని పార్టీని చాలా ఇబ్బంది పెట్టారు.
తాను పోటీ చేయనని, మాగుంటకు ఎంపీ టికెట్ ఇవ్వాలని, జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబడటం వంటి కార్యక్రమాలతో పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టారాయన.ఒకనొక సమయంలో ఆయన పార్టీ మారడానికి సైతం సిద్ధపడ్డారు. ఇక ఇలాగో గత ఎన్నికల్లో పోటీ చేశారాయాన. ఎన్నికల్లో తనతో పాటు, పార్టీ కూడా ఓడిపోవడంతో తన విమర్శలకు మరింత పదును పెట్టారు. ఫలితాల తర్వాత నుంచి బాలినేనిలో శైలి పూర్తిగా మారిపోయింది. ఎన్నికల ఫలితాల అనంతరం తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.ఒక దశలో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం గట్టిగానే జరిగింది.ఇక అనేక సందర్భాల్లో ఆయన వైసీపీని వీడి మరో పార్టీలో చేరుతున్నారనే లీకుల సైతం ఇచ్చారు. ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

ఆ లీకులు వచ్చినప్పుడల్లా వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగి బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం చేశారు .జగన్ సైతం బాలినేనిని తను వద్దకు పిలిచి సర్ది చెప్పారు. అయినా బాలినేని మాత్రం ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్లుగా వ్యవహరిస్తూనే వస్తున్నారు.దీంతో జగన్ సైతం బాలినేని విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.ఈ క్రమంలోని పార్టీలో ఆయన క్రమశిక్షణగా ఉంటే సరే, లేకపోతే పార్టీని వీడి వెళ్లినా నష్టం లేదనే అభిప్రాయంతో జగన్ ఉన్నారట.ఇకపై ఆయనను బుజ్జగించకూడదు అనే నిర్ణయానికి జగన్ వచ్చారట. ఇక బాలినేని వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోకూడదని, ఆయనకు ఇష్టమైతే పార్టీలో ఉంటారు లేదంటే వెళ్ళిపోతారనే అభిప్రాయంతో జగన్ ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి బాలినేని వ్యవహారాన్ని జగన్ లైట్ తీసుకున్నట్టే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications