ఆస్తిపన్ను చెల్లింపుదారులకు జగన్ సర్కార్ బంపర్ డిస్కౌంట్ ఆఫర్-వివరాలివే...
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గత నెలలో ఆస్తిపన్ను బకాయిలు ఉన్న వారికి ఓ ఆఫర్ ఇచ్చిన ప్రభుత్వం ఈ నెలలో పన్ను చెల్లించే వారికి మరో శుభవార్త చెప్పింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి ఈ నెలలో ఆస్తిపన్ను చెల్లించే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. దీంతో ఆస్తిపన్ను చెల్లింపుదారులు దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్దమవుతున్నారు.
ఏపీలో ఈ ఆర్ధిక సంవత్సరానికి అంటే 2023-24కు సంబంధించిన ఆస్తిపన్నును ఈ నెలలోనే చెల్లించే వారికి డిస్కౌంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాదికి సంబంధించిన ఆస్తిపన్ను ఒకేసారి చెల్లిస్తే వారికి ఐదు శాతం డిస్కౌంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పురపాలకశాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఇందులో డిస్కౌంట్ ఆస్తిపన్నుపై ఎలా వర్తిస్తుంది, ఆస్తిపన్నుతో పాటు మిగతా ఏయే పన్నులకు వర్తిస్తుందన్న విషయాలు కూడా పేర్కొన్నారు.

ప్రభుత్వం ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఇచ్చే ఈ ఐదు శాతం డిస్కౌంట్ పొందాలంటే ఈ ఏడాదికి సంబంధించిన మొత్తం పన్ను ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. రెండు అర్ధభాగాలుగా ఏడాదికి విధించే పన్ను ఒకేసారి చెల్లించే వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. అలా కాకుండా ఆరునెలల పన్ను చెల్లించే వారికి ఈ డిస్కౌంట్ వర్తించదు. అలాగే ఆస్తిపన్నుతో పాటు ఖాళీ స్ధలాలపై పన్ను, తాగునీటి ఛార్జీలను కూడా ఈ నెలలోనే చెల్లిస్తే ఈ డిస్కౌంట్ వాటికి కూడా వర్తిస్తుంది. ఏ పన్ను అయినా ఏడాది మొత్తానికి కలిపి ఇప్పుడే చెల్లిస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

వాస్తవానికి ప్రతీ ఏదాడి ఏప్రిల్ నెలలో ప్రభుత్వం ఈ ఆఫర్ ఇస్తుంటుంది. ఏడాదికి సంబంధించిన పన్ను చెల్లించేందుకు ఏడాది ముగింపు అంటే ఆర్ధిక సంవత్సరం ముగింపు నెల మార్చి 31వరకూ గడువు ఉంటుంది. అలా కాకుండా ముందుగా చెల్లించే వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆఫర్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే వినియోగదారుల నుంచి ముందస్తుగా పన్ను తీసుకోవడం ద్వారా భవిష్యత్ ఆదాయాన్ని ఇప్పుడే రాబట్టుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం దొరుకుతోంది.












Click it and Unblock the Notifications