వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్యశ్రీపై జగన్ కీలక నిర్ణయాలు-ఇక రీయింబర్స్ మెంట్ రోగులకే-ఏ డెలివరీకైనా 5 వేలు

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో వైద్యారోగ్య రంగంపై సీఎం జగన్ ఇవాళ నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీతో పాటు ఇతర సేవలు అందుతున్న తీరును అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సేవల్ని మరింత బలోపేతం చేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్న సీఎం..వాటిని అమలు చేయాలని ఆదేశాలు ఇఛ్చారు. అలాగే ఇప్పటికే నిర్దేశించుకున్న లక్ష్యాల్ని సకాలంలో పూర్తి చేయాలన్నారు.

 జగన్ వైద్యారోగ్య సమీక్ష

జగన్ వైద్యారోగ్య సమీక్ష

వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం .జగన్‌ ఇవాళ సమీక్ష నిర్పహించారు. ఇందులో రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, దాని కింద కార్యక్రమాలు, వైద్య ఆరోగ్యశాఖలో నాడు - నేడు కింద చేపడుతున్న పనులు, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్‌ కేర్‌ తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ఇందులో సీఎం జగన్ పలు కొత్త నిర్ణయాలు ప్రకటించారు. ఆరోగ్యశ్రీతో పాటు ఇతర పథకాల్లోనూ మార్పులు చేశారు.

 ఏ డెలివరీకైనా 5వేలు

ఏ డెలివరీకైనా 5వేలు

రాష్ట్రంలో ఏ తరహా ప్రసవం జరిగినా తల్లికి రూ.5వేలు ఇవ్వాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సహజ ప్రసవం జరిగినా, సిజేరియన్‌ జరిగినా రూ.5వేలు ఇస్తారు. గతంలో సిజేరియన్‌ జరిగితే రూ.3వేలే, దీన్ని రూ.5వేలకు పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సహజ ప్రసవం అయినా, సిజరేయన్‌ అయినా తల్లిబిడ్డల సంరక్షణ ముఖ్యం కాబట్టి, ఒకే మొత్తాన్ని ఇవ్వాలన్నారు. సహజ ప్రసవాలను పెంచడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సహజ ప్రసవంపై అవగాహన, చైతన్యం నింపాల్సిన బాధ్యత వైద్యులదేనని సీఎం తెలిపారు.

 ఆరోగ్య శ్రీ లో మరిన్ని చికిత్సలు:

ఆరోగ్య శ్రీ లో మరిన్ని చికిత్సలు:

ఆరోగ్య శ్రీపైనా సీఎం సమీక్ష నిర్వహించారు.ఇందులో ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చును అధికారులు వివరించారు. ఆరోగ్యశ్రీలో 2446 ప్రొసీజర్లు కవర్‌ అవుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు.దీనిపై నిరంతర అధ్యయనం చేయాలి, అవసరాల మేరకు, మరింత మంచి చేయడానికి ప్రొసీజర్ల సంఖ్యను పెంచాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించామని తెలిపారు.
వైద్యులు, వైద్య సంఘాలతో చర్చిస్తున్నామని అధికారులు వెల్లడించారు. వారంరోజుల్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నెలకు ఆరోగ్య శ్రీ కింద కనీసంగా రూ.270 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న అధికారులు, 104,108 కోసం నెలకు కనీసంగా రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య ఆసరా కింద నెలకు కనీసంగా రూ.35 కోట్లు ఖర్చుచేస్తున్నామని వివరించారు. అంటే కేవలం ఆరోగ్యశ్రీ, దానికింద కార్యకలాపాలకోసం ఏడాదికి దాదాపు రూ.4వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని అధికారులు తెలిపారు. గత ఏడాది ఆయుష్మాన్‌భారత్‌ కింద వచ్చింది రూ.223 కోట్లు అని తెలిపారు. ఈ ఏడాది రూ.360 కోట్లు ఇస్తామని అంచనా వేస్తున్నారు.

 రోగుల ఖాతాలకే ఆరోగ్యశ్రీ మొత్తం

రోగుల ఖాతాలకే ఆరోగ్యశ్రీ మొత్తం

ఆరోగ్య శ్రీ పథకం మరింత పారదర్శకంగా నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి డబ్బు, అక్కడ నుంచి ఆస్పత్రికి ఆటోడెబిట్లో చెల్లింపు అయ్యేలా చూడాలన్నారు. ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా ఈ ప్రక్రియ చేపట్టాలన్నారు. ముందుగా పేషెంటు డిశ్చార్జి అయ్యే సమయంలో కన్సెంటు ఫారం స్వీకరించాలని, పేషెంటు, బ్యాంకు, ఆస్పత్రి మధ్య కన్సెంటుతో కూడిన ఫారం ఉండాలన్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ విధానంలో చాలావరకు పొరపాట్లను నివారించే అవకాశం ఉంటుందన్నారు.

 జగన్ కీలక నిర్ణయాలు

జగన్ కీలక నిర్ణయాలు

రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపైనా సీఎం సమీక్ష చేశారు. ఇందులో కోవిడ్‌ పరిస్థితులన్నీ పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని అధికారులు తెలిపారు. అనంతరం విలేజ్‌ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, కొత్త ఆస్పత్రుల నిర్మాణం, వీటిలో అభివృద్ధి పనులు నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు ఇఛ్చారు. అలాగే కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై సీఎం సమీక్ష చేశారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు వస్తున్నాయి. వీటిలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నంలలో కొత్త మెడికల్‌ కాలేజీల్లో 2023 నుంచి మెడికల్‌ ప్రవేశాలకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ పై దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలోనే క్యాన్సర్‌ గుర్తింపుపై దృష్టిపెట్టాలన్నారు.

English summary
ap govt has decided to give ysr arogya sri amount to patients intead of hospitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X