గ్రామ వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్-అమరావతిలో వారికి రూ.2500 ..

ఏపీలో అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రతీ ఏటా కౌలు చెల్లిస్తున్న ప్రభుత్వం .. అక్కడ పనిచేస్తున్న వాలంటీర్లకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది.

ఏపీలో సీఎం జగన్ ఆదేశాలతో అమరావతిలో భూమి లేని గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు నెలకు రూ.2,500 పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. మార్చి ఒకటో తేదీ నుండి ఈ పెన్షన్ పధకం అమరావతి గ్రామ వాలంటీర్లకు వర్తిస్తుందని శ్రీలక్మి తెలిపారు. అమ‌రావ‌తి లో భూమి లేని నిరుపేద‌ కుటుంబాలకు చెందిన యువతీ యువకులైన గ్రామ వాలంటర్లుగా పని చేస్తున్నారు. వీరిని ఉద్యోగులు గా పరిగణించి ప్రతి నెలా భూమి లేని నిరుపేద కుటుంబాలకు పింఛ‌ను రూ.2,500 మంజూరు చేస్తున్నారు.

ఇటీవల పురపాలక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అమరావతి గ్రామాలలో పర్యటనలో ఉన్న సమయంలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వాలంటీర్లు విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి ఈ విషయం తెచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన శ్రీలక్ష్మి ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని అమరావతి వాలంటీర్ల కు హామీ ఇచ్చారు.సత్వరమే ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను వివరించారు.

jagan regime good news to amaravati village volunteers-rs.2500 pension from march 1

దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్ వారికి పెన్షన్లు అందించాలని ఆదేశించారు.అమరావతిలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన సుమారు 200 మంది గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు మార్చి1వ తేదీ నుండి పెన్షన్ అందిస్తున్నామని మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి స్పష్టం చేశారు. దీంతో అక్కడి నిరుపేద వాలంటీర్లకు ప్రయోజనం కలగబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+