ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- ఉద్యోగాల కోసం ఎంప్లాయ్ మెంట్ ఎక్ఛేంజ్ వెబ్ సైట్..!

ఏపీలో ఎన్నికల వేళ నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో యువతీయువకులకు ఉద్యోగావకాశాలు పెంచే దిశగా మరో ముందడుగు వేసింది. విద్యార్హత, అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల సమాచారం తెలుసుకుని ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుగా వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇవాళ ఈ పోర్టల్ ను ప్రారంభించారు.

'ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్' పేరుతో ప్రారంభించిన ఈ వెబ్ పోర్టల్ నిరుద్యోగలకు అన్ని విధాలా ఉపయోగపడుతుందని మంత్రి బుగ్గన ఆవిష్కరణ సందర్భంగా తెలిపారు. ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్ నమోదులో గతంలో సీనియార్టీని బట్టి ఉద్యోగాల భర్తీ జరిగేదని..ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు వెబ్ సైట్ ప్రారంభించడం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఉద్యోగం అనివార్యమనుకునే యువత ఎక్కడెక్కడో శోధించాల్సిన పని లేకుండా సమస్త సమాచారం, సమగ్ర రంగాలకు సంబంధించిన వివరాలను ఈ వెబ్ పోర్టల్ ద్వారా యువతకు మరింత చేరువ చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు.

jagan regime good news to unemployed, launches employment exchange portal for job applications

పదో తరగతి దగ్గర నుంచి డిగ్రీ, డిప్లమో ఏది చేసినా సరే employment.ap.gov.in పోర్టల్ లో నమోదు చేసుకుంటే పూర్తి సమాచారాన్ని బట్టి ఆయా రంగాలలో గల ఉపాధి అవకాశాలు వెంటనే తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు బుగ్గన తెలిపారు. ఎంప్లాయ్ మెంట్ కార్డు లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు. గతంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఉద్యోగవకాశాలలో ప్రాధాన్యత ఉండడం వలన రిజిస్ట్రేషన్ నంబర్ ను పదిలంగా దాచుకునేవారని, కానీ ఇప్పుడు పరిస్దితులు మారాయన్నారు.

ఇంజనీరింగ్, ఎంబీఏ, డిగ్రీ కోర్సులు సహా ఐ.టీ, టెక్నికల్ రంగాలపై యువత ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో 'ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్' ను వారి అవసరాలకు పెద్దపీట వేస్తూ రూపొందించినట్లు నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఆన్లైన్ సేవలు భారత ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ తో అనుసంధానం చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగమేదైనా దానికి సంబంధించిన సమాచారం అధికారికంగా తెలుసుకుని, దరఖాస్తు చేసుకునేందుకు అనువుగా పోర్టల్ ను తీర్చిదిద్దినట్లు ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య పేర్కొన్నారు. ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా లాగిన్ అయి విద్యార్హతల వివరాలను పోర్టల్ లో ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ నంబర్ మెసేజ్ ద్వారా వస్తుందన్నారు. అభ్యర్థుల వివరాలు జిల్లా స్థాయి అధికారికి చేరి, వారి ఆమోదంతో ఎంప్లాయ్ మెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ తెలియజేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+