NRIలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్- ఏకంగా సగం డిస్కౌంట్-సంక్రాంతి వరకే..!
విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్ర ఉద్యోగులు, వలసకార్మికులు, విద్యార్థులకు సదవకాశం ఏపీ ప్రభుత్వం ఇవాళ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా విదేశాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో రాష్ట్రానికి చెందిన వారు మృత్యువాత పడుతున్న, గాయాల పాలవుతున్న ఘటనలు పెరుగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వ సంస్ధ ఏపీఎన్నార్టీఎస్ ఇప్పటివరకూ కడుతున్న ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని సగానికి తగ్గించింది. విద్యార్దులకు పూర్తిగా మాఫీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ సంస్థ APNRTS అందిస్తున్న ప్రవాసాంధ్ర భరోసా బీమా ప్రీమియంలో 50 శాతం రాయితీని అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఏపీఎన్నార్టీఎస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు అనేక సేవలను అందిస్తోంది. ఇందులో ఒకటి ప్రవాసాంధ్ర భరోసా బీమా. ఇది ప్రవాసాంధ్రుల కుటుంబానికి ధీమాగా ఉంటోంది. విదేశాల్లో పనిచేసే ఉద్యోగులు, వలసకార్మికులు, డ్రైవర్లు, హౌస్ మెయిడ్స్, హెల్పర్లు ఇలా వివిధ రంగాలలో పనిచేసే వారికి ఈ బీమా సదుపాయం కల్పిస్తున్నారు.

మూడు సంవత్సరాలకు కేవలం రూ.275 లతో, అలాగే విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ఏపీ విద్యార్థులు పూర్తి ఉచితంగా ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమా లో నమోదు చేసుకోవచ్చని ఏపీఎన్నార్టీఎస్ తెలిపింది. ఈ అవకాశం 26 డిసెంబర్ 2023 నుండి 15 జనవరి 2024 వరకు మాత్రమే ఉంటుంది. దీనిని, విద్యార్థులతో సహా ప్రవాసాంధ్ర ఉద్యోగస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు మేడపాటి వెంకట్, సీఈఓ హేమలత రాణి కోరారు.
ఇప్పటివరకు ఉద్యోగులకు 3 సంవత్సరాలకు రూ.550 ల ప్రీమియం, విద్యార్థులకు సంవత్సరానికి రూ. 180 ల ప్రీమియం ఉండేది. అయితే ప్రవాసాంధ్రులు, వారి కుటుంబ సభ్యుల శ్రేయస్సు దృష్ట్యా, ఉద్యోగులు కడుతున్న ప్రీమియంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఇక విద్యార్టులకైతే పూర్తి ఉచితంగా నమోదు చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ బీమా వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వలన మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రమాదం వలన సంభవించే గాయాలు, అనారోగ్యం చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు రూ. 1లక్ష వరకు చెల్లిస్తారు. బీమా తీసుకున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి హాస్పిటల్ ఖర్చులకు రూ. 50 వేల వరకు చెల్లింపు... ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో దాతలు ముందుకు వచ్చి వలసకార్మికులకు బల్క్ గా (ఎక్కువ సంఖ్యలో) కూడా ఈ బీమాలో నమోదు చేయించవచ్చు. ఏపీఎన్ఆర్టీఎస్ కో ఆర్డినేటర్లు ఆయా దేశాలలో దీని గురించి విస్తృత ప్రచారం చేసి, అవగాహన కల్పించి దాతల ద్వారా ఈ బీమాలో నమోదు చేయించాలని ఏపీఎన్నార్టీఎస్ కోరుతోంది.
ఈ పథకాన్ని అమలు చేయడం కోసం APNRTS, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (బీమా సంస్థ)తో ఒప్పందం కుదుర్చుకుంది. 15 జనవరి 2024 వరకు ఇది చెల్లుబాటులో ఉంటుంది. అనంతరం APNRTS ఇన్సూరెన్స్ కంపెనీతో కొత్త ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆ కొత్త ఒప్పందంలో బీమా కంపెనీ రూ.550 ల కంటే ప్రీమియం మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు వెంటనే ఈ పథకంలో నమోదు చేసుకోవాలని కోరుతున్నారు.
ప్రవాసాంధ్ర భరోసా బీమా నందు నమోదు కొరకు APNRTS 24/7 హెల్ప్‌లైన్ +91-863-2340678; +91 85000 27678 (వాట్సప్) ను సంప్రదించాలని కోరుతున్నారు. అలాగే వీరి వెబ్ సైట్ https://www.apnrts.ap.gov.in/index.php/home/insurance_new లో లాగిన్ కావాలని కోరుతున్నారు. లేదా [email protected]; [email protected] కు ఇమెయిల్ చేయాలని కోరుతున్నారు.
ఏపీఎన్ఆర్టీఎస్ అందించే వివిధ సేవలు, అప్డేట్స్ కొరకు https://www.apnrts.ap.gov.in/ ని సందర్శించాల్సి ఉంటుంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications