జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్-సంక్రాంతి కల్లా 176 స్కిల్ హబ్ లు-10 వేల మందికి లబ్ది..

ఏపీలో యువతకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా స్కిల్ హబ్ ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని స్కిల్ హబ్ లు ప్రారంభం కాగా.. మిగిలిన వాటిని కూడా ఈ సంక్రాంతి కల్లా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో త్వరలో ఆవిష్కరించబోయే లోగో (చిహ్నం) డిజైన్ ను మంత్రి బుగ్గన పరిశీలించారు.

రాష్ట్రంలో సంక్రాంతి నాటికి 176 స్కిల్ హబ్ ల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నైపుణ్య, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. ఇవాళ విజయవాడలోని రాష్ట్ర ఆర్థిక సంస్థ కార్యాలయంలో స్కిల్ హబ్ లు, కాలేజీల పురోగతిపై మంత్రి బుగ్గన కీలక సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 66 స్కిల్ హబ్ లు చేశార. ఇందులో 2,400 మందికి ఏపీఎస్ఎస్డీసీ శిక్షణ అందిస్తోంది. మిగతా 111 స్కిల్ హబ్ ల ఏర్పాటు దిశగా మంత్రి దిశానిర్దేశం చేశారు.

jagan regime to launch 176 skill hubs by sankranti-benefit to more than 10k youth

ప్రతి స్కిల్ హబ్ లో 2 కోర్సుల చొప్పిున మొత్తం 222 కోర్సులలో శిక్షణకు సిద్ధంగా ఉండాలని మంత్రి బుగ్గన ఆదేశాలు ఇచ్చారు. 176 స్కిల్ హబ్ లు అందుబాటులోకి తీసుకువచ్చి 10 వేల మందికిపైగా యువతకు నైపుణ్య, శిక్షణ అందించేలా అడుగులు వేయాలన్నారు. శిక్షణ కేంద్రాలలో యువతకు ఆహారం, పరిశుభ్ర, ప్రశాంత వాతావరణం వంటి మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దడంలో రాజీపడొద్దని మంత్రి ఆదేశించారు. స్కిల్ కాలేజీలు ఎలా ఉండాలి, క్లాస్ రూమ్ లు, ల్యాబ్, ట్రైనర్ వంటి అంశాలపై ఇవాళ ఆయన సమీక్షించారు. సాంకేతిక విద్య, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లతో ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలపైనా ఆరా తీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+