చిత్తూరు జిల్లాలో జగన్ పాదయాత్ర: సభలో కూలిన స్టేజ్, పలువురికి గాయాలు

చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఆదివారం స్వల్ప ప్రమాదం జరిగింది. సభా వేదిక కూలడంతో, కొంత తొక్కిసలాట జరిగింది. దీంతో కొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి.

వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో పెళ్లి మండపం వద్ద ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

 కూలిన వేదిక, పలువురికి గాయాలు

కూలిన వేదిక, పలువురికి గాయాలు

అంతకుముందే, జగన్ బహిరంగ సభ వద్దకు రాకముందు సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు జరిగాయి. ఈ వేదిక పైకి ఎక్కువ మంది నేతలు, కార్యకర్తలు వచ్చారు. దీంతో ఆ వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, తొట్టంబేడు మండల నాయకుడికి గాయాలు అయ్యాయి.

Recommended Video

    YS Jagan padayatra : బీసీలకు అండగా ఉంటా, బాబు లా మోసం చెయ్యను !
     మేం నిలదీసినప్పుడు ఎవరూ మాట్లాడలేదు

    మేం నిలదీసినప్పుడు ఎవరూ మాట్లాడలేదు

    బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర ప్రగతిని ఢిల్లీలో అడ్డంగా తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో మేము గొంతెత్తి మాట్లాడితే అప్పుడంతా ఊరుకున్నారని, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో హోదా విషయమై అవసరమైతే కోర్టుకు వెళ్తామని చంద్రబాబు చెబుతున్నారన్నారు.

     ఎవరి మీద ఏమని కోర్టుకు వెళ్తారు

    ఎవరి మీద ఏమని కోర్టుకు వెళ్తారు

    ఎవరి మీద ఏమని కోర్టుకు వెళ్తారో ప్రజలకు వివరించాలని జగన్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. ఆ సమయంలో ప్రజలను మభ్యపెట్టడంలో ఆయనంత గొప్పవాళ్లు మరొకరు లేరన్నారు. చంద్రబాబు ఎప్పుడు కనిపించినా ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారంటూ నిలదీయాలన్నారు.

    21మందిని కాల్చి చంపించారు

    21మందిని కాల్చి చంపించారు

    జిల్లాలో హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల-స్వర్ణముఖి కాల్వలు అసంపూర్తిగా ఉండటంతో రైతులకు కష్టాలు తప్పడం లేదని జగన్ అన్నారు. పుష్కరాల సమయంలో 29 మందిని పొట్టన పెట్టుకున్నారని చెప్పారు. ఎర్రచందనం తరలిస్తున్నారంటూ అమాయకులైన 21 మందిని కాల్చి చంపించారన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్‌, పెట్రోలు ధరలు మన దగ్గర ఎక్కువ ఉండటం శోచనీయమన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరూ వైసీపీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

    900 కి.మీ. పాదయాత్ర, రావిమొక్క నాటారు

    900 కి.మీ. పాదయాత్ర, రావిమొక్క నాటారు

    కాగా, వైయస్ జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి వద్ద 900 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ రావి మొక్కను నాటారు. నవంబర్ 6న జగన్ ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+