ఓడినా విచారం లేదు: సీఎం జగన్ వ్యాఖ్యలు; వైసీపీ ప్యాకప్: లోకేష్ సెటైర్లు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి జరగనున్న ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న క్రమంలో తాజాగా ఇండియా టుడే సమ్మిట్లో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ తో జరిపిన సంభాషణలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు ఓటముల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీడీపీకి జగన్ ను టార్గెట్ చెయ్యటానికి ఆయుధం అయ్యాయి.
సీఎం జగన్ తాను ఇచ్చిన హామీల్లో దాదాపు అన్ని హామీలను నెరవేర్చానని.. కాబట్టి తను ఓడిపోయిన తనకు విచారం లేదని, తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు టార్గెట్ గా మారింది. ఈ వ్యాఖ్యలను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కెసిఆర్ చేసిన వ్యాఖ్యలతో పోల్చి తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నారు.

కెసిఆర్ కూడా ఎన్నికలకు ముందు నేను ఓడిపోతే మీకే నష్టం.. నాకేం నష్టం అంటూ వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నాయకులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓడిన విచారణ లేదంటూ ఇప్పటికిప్పుడు సంతోషంగా దిగి పోతానని జగన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేసారు అని వైసిపి ప్యాకప్ అవుతుందంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. 2024లో జగన్ ఇక ఉండరని, ఈ ఏడాదికి బై బై జగన్ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీలో భయం కనిపిస్తుందన్నారు.
వై నాట్ 175 అంటూ ఇన్నాళ్లు ప్రచారం చేసుకున్న జగన్ ఇప్పుడు మళ్లీ స్వరం మారుస్తున్నారని లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు జగన్ ఓడినా బాధ లేదని మాట్లాడడంతో జగన్ కు రియాలిటీ అర్థమయ్యే ఈ మాట మాట్లాడుతున్నారని టిడిపి శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. గెలుస్తామని ధీమా ఉన్నవాళ్లు ఇలా మాట్లాడరని సోషల్ మీడియా వేదికగా చర్చ పెడుతున్నారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications