Jagan Speaks:మేం చేసిన తప్పేంటి..మీరు చేస్తుందేంటి : కేసీఆర్ కు మరోసారి స్నేహహస్తం : షర్మిల పార్టీ పైనా..!!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాల పైన ముఖ్యమంత్రి జగన్ తొలి సారి బహిరంగంగా స్పందించారు. తెలంగాణ మంత్రులు ఈ వివాదం పైన ఇస్టానుసారం మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. సమైక్య రాష్ట్రం విడిపోయిన తరువాత 2015 జూన్ లో నీటి కేటాయింపుల ఒప్పందం చేసుకున్నారని జగన్ చెప్పుకొచ్చారు. ఆ ఒప్పందం పైన ఏపీ-తెలంగాణతో పాటుగా కేంద్రం సైతం సంతకం చేసిందని చెప్పారు. ఆ లెక్కల ప్రకారం సీమకు 144, కోస్తా 367 , తెలంగాణకు 298 టీఎంసీల నీరు మొత్తంగా 811 టీఎంసీలు వినియోగానికి అంగీకారం జరిగిందన్నారు.

ఇప్పుడున్న రాయలసీమ పరిస్థితి ఒక్క సారి గమనించాలని సూచించారు. పోతిరెడ్డి పాడు నుండి కిందకు నీరు రావాలంటే శ్రీశైలంలో 885 అడుగులు చేరితే తప్ప రావని వివరించారు. ఈ రెండు సంవత్సరాల్లో వర్షాలు పడ్డాయి. కానీ, 20 ఏళ్లలో 881 పై చిలుకు నీటి నిల్వలు నమోదైంది కేవలం 20-25 రోజులు నీరు ఉందని లెక్కలు చెప్పారు. తెలంగాణలో రంగారెడ్డి-డిండి-కల్వకుర్తి కెపాసిటీ పెంచినా వినియోగిస్తున్నా..అన్నీ 800 అడుగుల లోపు తీసుకొనే వెసులుబాటు ఉందని చెప్పుకొచ్చారు.

Jagan Speaks on water dispute:Appeal to CM KCR to continue good relation between two states

796 అడుగుల్లోనే వారు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసారు. మీకు కేటాయింపు చేసిన నీటిని వాడుకుంటే తప్పు లేనప్పుడు...అదే 800 అడుగుల్లో సీమ లిఫ్టు మా నీటిని..మా హక్కుగా వచ్చిన నీటిని వాడుకుంటే తప్పు ఏంటని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో..కేసీఆర్ పాలమూరు - రంగారెడ్డి- డిండి ఎత్తిపోతల పనులు చేస్తున్నప్పుడు గాడిదలు కాస్తున్నావా అంటూ చంద్రబాబు ను నిలదీసారు. 800 అడుగుల్లోనే ఏపీకి ఉన్న అవకాశం మేరకు లిఫ్ట్ ద్వారా సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.

రైతు ఎక్కడ ఉన్నా రైతే...వాళ్లు బతకాలి..మనం బతకాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాజకీయాలు జరుగుతున్నాయంటే చూడలేక మాట్లాడుతున్నానని జగన్ చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రంతో విభేదాలు వద్దు..సత్సంబంధాలు కావాలనేదే తమ విధానమని జగన్ తేల్చి చెప్పారు. తెలంగాణలో - ఇక్కడ ప్రజలు చల్లగా ఉండాలని జగన్ వ్యాఖ్యానించారు. పాలకుల మధ్య కూడా సఖ్యత ఉండాలని ..మనసారా కోరుకుంటున్నానని జగన్ స్పష్టం చేసారు.

Recommended Video

    Union Cabinet Reshuffle : దక్షిణాదిన ఏపీకి మొండిచెయ్యి | Impact On AP Key Projects | Oneindia Telugu

    ఇదే సమయంలో ఈ రోజు తెలంగాణలో పార్టీ ప్రారంభిస్తున్న షర్మిల అంశాన్ని జగన్ పరోక్షంగా ప్రస్తావించారు. తనకు ఆ అంశంతో సంబంధం లేదనే సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నించారు.తెలంగాణలో రాజీయాల్లోకి జగన్ వేలు పెట్టలేదని...పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ..తమిళనాడు..కర్ణాటక లో రానున్న రోజుల్లోనూ వేలు పెట్టబోనని జగన్ తేల్చి చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+