పోలవరం ప్రాజెక్ట్ చూడకుండా...గోదావరి జిల్లా దాటిన వ్యక్తి జగన్:మంత్రి ఉమా
విజయవాడ:జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ మరోసారి ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. పోలవరం ప్రాజెక్టు చూడకుండానే గోదావరి జిల్లా దాటిన వ్యక్తి జగన్ అని ఆయన విమర్శించారు. శుక్రవారంనాడు జలవనరుల శాఖ విడిది కార్యాలయంలో మంత్రి ఉమా మీడియాతో మాట్లాడారు.
Recommended Video

పట్టిసీమపై కాంగ్రెస్, వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టికి ఇప్పటి వరకూ నీరు రాలేదని, అయినా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లిస్తుంటే కుళ్లుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈనెల 11న కేంద్ర మంత్రి గడ్కరీ రాష్ట్రానికి రానున్నట్లు మంత్రి దేవినేని ఉమా తెలిపారు.

నీటి తరలింపు...రికార్డు
గోదావరి డెల్టా మూడో పంటకు కూడా నీరు ఇస్తామని, ఇప్పటివరకు ప్రాజెక్టులకు 54 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి దేవినేని ఉమ చెప్పారు. నీటిని ఒక బేసిన్ నుండి మరో బేసిన్‌కు 105 టీఎంసీలు తరలించడం ఒక రికార్డు అని మంత్రి దేవినేని ఉమ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు ఇవ్వటమే తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

వాళ్లే వీళ్లు...జగన్ కు బుద్ది
పట్టిసీమను అందరూ అభినందిస్తుంటే జగన్‌కు కనిపించడం లేదా?...అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించిన వారే ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలే వైసీపీ బీజేపీ నేతల గా రూపాంతరం చెందుతున్నారన్నారు. బిజెపి వైసీపీ జనసేన మూడు పార్టీలు తోడుదొంగలని, బొత్స, కన్నా, ధర్మాన పదేళ్లుగా మంత్రులుగా ఉండి ఏపీకి ఏం చేశారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే జగన్ కి బుద్ధి చెబుతారని అన్నారు.

ఈ నెలలోనే...టెండర్లు
వైసీపీ ఎమ్మెల్యే లు అసెంబ్లీకి రారని, పార్లమెంట్ కు ఎంపీలు వెళ్ళరని, వీరికి రాష్ట్ర ప్రయోజనాల అవసరం లేదని మంత్రి ఉమా దుయ్యబట్టారు. వైకుంఠపురం బ్యారేజ్‌కు ఈ నెలలో టెండర్లను పిలుస్తున్నామని మంత్రి తెలిపారు. 10 టీఎంసీల సామర్థ్యంతో వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణం ఉంటుందన్నారు.
గోదావరి-పెన్నా అనుసంధానంతో సోమశిల, పెన్నా, కండలేరు ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని తెలిపారు.

గడ్కరీ రాక
ఎంపి విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నలు వేస్తూ పక్కరాష్ట్రాలకు సమాచారం ఇస్తున్నారని మంత్రి ఉమ ఆరోపించారు. ఈనెల 11న కేంద్రమంత్రి గడ్కరీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని, పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని మంత్రి దేవినేని ఉమా తెలిపారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications