చంద్రబాబును బాగా ఇరికించిన జగన్.. బాబు కింకర్తవ్యం!

ఊహించని విధంగా వైఎస్ జగన్ చంద్రబాబును వక్ఫ్ చట్ట సవరణ బిల్లు విషయంలో ఇరికించారు. 2013 నాటి వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని తిరిగి సవరించేందుకు కేంద్రం ఈరోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టగా ఈ బిల్లును విపక్ష ఇండికూటమిలోని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఇక ఎన్డీఏ కూటమిలోని పార్టీలు మద్దతు తెలుపగా టిడిపి కూడా ఈ బిల్లు పైన తన మద్దతును ప్రకటించింది.

చంద్రబాబును ఇరికించిన జగన్
వైసిపి ఈ బిల్లును వ్యతిరేకించింది. దీంతో జగన్ మోడీకి షాక్ ఇచ్చి చంద్రబాబును ఇరికించారు. ఈ క్రమంలో చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలు ఒత్తిడి తెస్తున్నారు. వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించి సెలెక్ట్ కమిటీకి పంపాలని ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వినతి పత్రాన్ని ముస్లిం మైనారిటీ సంఘాలు అందించాయి.

Jagan trapped chandrababu in Waqf Act Amendment Bill muslim minorities pressure on chandrababu

చంద్రబాబుపై ముస్లిం మైనారిటీల ఒత్తిడి
ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ, సీఎం గారికి వినతి పత్రాన్ని అందిస్తూ వివాదాస్పద వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ముస్లిం సమాజానికి అనేక అపోహలు ఉన్నందున సమగ్ర చర్చ జరిగే విధంగా సెలెక్ట్ కమిటీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ముస్లిం మైనారిటీల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందిస్తూ సీఎం ముస్లింలకు అన్ని విధాలుగా మా పార్టీ అండగా ఉంటుందని అన్నారు.

జగన్ చర్యతో చంద్రబాబుకు తలనొప్పి
అయితే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న ఈ బిల్లుకు మద్దతు తెలిపిన చంద్రబాబు, ఇప్పుడు ముస్లిం మైనారిటీల ఒత్తిడితో ఈ బిల్లు విషయంలో ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. జగన్ తన చర్యతో ముస్లిం మైనారిటీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసి, చంద్రబాబుకు వారిని దూరం చేసే ప్లాన్ చేశారు.

చంద్రబాబు ఏం చేస్తారు?
అదే విధంగా రాష్ట్రంలోని మైనారిటీ మంత్రి NMD ఫరూక్ కి కూడా ముస్లిం మైనారిటీలు వినతి పత్రాన్ని అందించారు. వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని వారు కోరారు. ముస్లిం మైనారిటీలు కోరుతున్నట్టు చంద్రబాబు వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సి వస్తుంది. లేదు కేంద్రానికి అనుకూలంగా ఉంటే ముస్లిం మైనారిటీలకు బాబు దూరం కావలసి వస్తుంది. మొత్తానికి జగన్ సరైన సమయంలో అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+