జనసేన వ్యూహం బూమ్ రాంగ్ - నిరసనల సీన్ రివర్స్..!!
రాష్ట్రంలో జగనన్న కాలనీల వద్ద జనసేన నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల్లో వరదనీరు వచ్చిందని..సౌకర్యాలు లేవంటూ డిజిటల్ ప్రచారం ప్రారంభించింది. కానీ, వారి వ్యూహం బెడిసి కొడుతోంది. పలు ప్రాంతాల్లో జగనన్న లబ్దిదారులు జనసైనికులను నిలదీస్తున్నారు. ఇళ్లు మీరెందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. వర్షం తమ ప్రాంతంలోనే కాదని..మహానగరాలే ముగినిపోయాయని ఊహించని షాక్ ఇచ్చారు.
రాష్ట్ర వ్యప్తంగా 40 లక్షల మంది మహిలలకు ఇళ్లు ఇవ్వాలనేది సీఎం జగన్ లక్ష్యం. ఇందుకోసం మహాళలకు జగనన్న కాలనీల్లో ఇళ్ల పేరుతో ఇంటి పట్టాలు అందిస్తున్నారు. దశల వారీగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. నిర్మాణల విషయంలోనూ పూర్తిగా లబ్దిదారులకే ఆప్షన్లు ఇచ్చి ఎంపిక చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావటంతో కాలనీల్లోకి నీరు రావటంతో పాటుగా..నిర్మాణాల పైన ప్రభావం పడింది. ఈ సమయంలో జనసేన రాజకీయంగా ఈ భారీ వర్షాలను అనుకూలంగా మలచుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా జగనన్న కాలనీల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. కానీ, అక్కడే సీన్ రివర్స్ అయింది.

భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో చేస్తున్న ఈ నిరసనల పైన జగనన్న ఇళ్ల లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. జనసైనికులను నిలదీసారు. మీరు ఏం చేసారంటూ వారిని ప్రశ్నించారు. మీరెందుకు ఇళ్లు ఇవ్వలేకపోయారంటూ ప్రశ్నలు కురిపించారు. దేశ వ్యాప్తంగా మహానరగాలే భారీ వర్షాలకు మునిగిన విషయం తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. చెన్నై, బెంగళూరు వంటి నగరాలే భారీ వర్షాల ధాటికి అతలాకుతలం అయ్యాయి. తాజా వర్షాలకు పోటెత్తిన యమునా నది ప్రవాహానికి ఢిల్లీ, ఆగ్రా నగరాలు మునగలేదా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లో పరిస్థితి ఏంటని నిలదీసారు. దీంతో, అక్కడ నుంచి జనసైనికులు షాక్ అయ్యారు.
కొంచెం ఉంటే.. ప్రజలు కొట్టేలా ఉన్నారు పవన్ కళ్యాణ్ ను, జనసైకోలను
— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) July 29, 2023
మాకు జగనన్న ఇళ్ళు ఇచ్చాడు... మీరు ఏం చేశారు అంటూ జన సైనికుల మీద విరుచుకు పడుతున్న జగనన్న కాలనీ ఇళ్ల లబ్ధిదారులు
@PawanKalyan ఇదీ గ్రౌండ్ రియాలిటీ!#PawanKalyanAntiPoor pic.twitter.com/VXngv5Rog2
ఒకసారి కాలనీ రూపొందిన తరువాత ప్రజలు ఒక్కొక్కరుగా ఇల్లు కట్టుకుంటుండగా అక్కడ రోడ్లు, ఎత్తు చేయడం, విశాలంగా రోడ్లు వేయడం.. కాలువలు వేసి వాననీరు పారుదలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది . అవేమీ లేకుండా ఖాళీగా ఉన్న లే అవుట్లో లేదా ఖాళీ భూభాగంలో ఎక్కడైనా వాననీరు నిలుస్తోంది. ఆ ప్రాంతాల్లోకి వెళ్లి జనసైనికులు నిరసనకు దిగుతున్నారు. దీంతో, అక్కడి లబ్దిదారులు వారిని నిలదీస్తున్నారు. తాము ఎక్కడా రూపాయి లంచం లేకుండా ఇల్లు పొందామని..అన్ని సౌకర్యాలు అందుతాయనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు..వరదల సమయంలో నిరసనలకు జనసేన నిర్ణయించటం ఏంటనే చర్చ మొదలైంది.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications