చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పరువునష్టం కేసులో జీవితా రాజశేఖర్ లకు జైలుశిక్ష!!

పరువు నష్టం కేసులో సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు షాక్ ఇస్తూ నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేట్ సంచలన తీర్పు వెల్లడించింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై వారు చేసిన ఆరోపణలకు, దాఖలైన పరువు నష్టం దావా పై విచారణ జరిపిన కోర్టు మంగళవారం నాడు జీవిత రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్ష, ఐదువేల రూపాయలు జరిమానా విధించింది.

ఈ కేసు పూర్వపరాలలోకి వెళితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి అవసరమైన వారికి రక్తాన్ని అందిస్తూ సేవ చేస్తున్నారు. అయితే సినీ నటులు జీవిత, రాజశేఖర్ మెగాస్టార్ చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. 2011లో ఒక ప్రెస్ మీట్లో జీవిత రాజశేఖర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై సంచలన ఆరోపణలు చేశారు.

 jeevitha rajasekhar

ఇక వారి వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఎంతోమందికి సహాయం దొరుకుతుందని, అటువంటి చిరంజీవి పరువుకు భంగం కలిగేలా జీవిత రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న కార్యక్రమాలపైన, చిరంజీవి ట్రస్ట్ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ జీవిత రాజశేఖర్ లపై పరువు నష్టం దావా వేశారు.

వారు చేసిన ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సిడి రూపంలో కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ కేసు పై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు నిన్న తీర్పును వెల్లడించింది. జీవిత, రాజశేఖర్ ఇద్దరికీ ఏడాది జైలు శిక్షతో పాటుగా, 5000 రూపాయలు జరిమానా విధించింది.

 jeevitha rajasekhar

ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో జరిమానా చెల్లించిన వారిద్దరు నుంచి పూచీకత్తులను సమర్పించి బెయిల్ తీసుకుని విడుదలయ్యారు. మరి ఈ కేసులో జిల్లా కోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్న జీవిత రాజశేఖర్ కు అక్కడైనా పరిస్థితి అనుకూలంగా ఉంటుందా? అన్నది భవిష్యత్ లో తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+