Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ ఇలా ఇచ్చాం!: ఏపీ విభజనపై జైరాం రమేశ్ పుస్తకం

హైదరాబాద్: జైరాం రమేశ్... ఈ పేరు తెలుగువారి బాగా సుపరిచితం. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో, చట్టం రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. ఏపీ విభజన ప్రక్రియలో అన్నీ తానై ముందుండి నడపించాడు. ఆనాటి ముచ్చట్లు, చోటు చేసుకున్న ఆసక్తికర అంశాలపై 'ఓల్డ్‌ హిస్టరీ-న్యూ బయోగ్రఫీ' (పాత సంగతులు-కొత్త సరిహద్దులు) పేరిట రాష్ట్ర విభజనపై పుస్తకం రచించారు.

ఈ పుస్తకంలో తొలి 42 పేజీలు పరిచయం, పాత చరిత్ర ఉంది. ఆ తర్వాత 2009 నవంబర్‌ 9న కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్ష నుంచి మొదలుకొని... తెలంగాణ రగుల్కొనడంతో రెండో అధ్యాయం మొదలు... పది జిల్లాల తెలంగాణ కోసం ప్రజలు పది రోజులు పాటు భగ్గుమన్న విషయాలను ప్రస్తావించారు. ఆ తర్వాత డిసెంబర్‌ 9న రాత్రి 11:30గంటలకు చిదంబరం చేసిన ప్రకటన గురించి జైరాం ఇందులో ప్రస్తావించారు.

'ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన ఆ పది రోజులు' పేరిట ఆ తర్వాత చెలరేగిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. 'డిసెంబర్‌ 9'నుంచి వెనక్కి వెళ్లేందుకు దారితీసిన పరిస్థితులు సైతం ఈ పుస్తకంలో కూలంకుషంగా వివరించారు.

''సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు. విదర్భ, గూర్ఖాలాండ్‌, బోడోలాండ్‌, మారుప్రదేశ్‌ డిమాండ్లు ఊపందుకున్నాయి. తమిళనాడు నేత ఎస్‌.రాందాస్‌ తమ రాష్ట్రాన్నీ విభజించాలన్నారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగుగా విభజించాలని సీఎం రెండుసార్లు లేఖలు రాశారు. డిసెంబర్‌ 9 ప్రకటన తనను దిగ్ర్భాంతి పరిచిందని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి రోశయ్య వ్యాఖ్యానించారు'' అని వివరించారు.

 Jairam Ramesh book: ‘Suicides, Opposition chorus led to Andhra division’

ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది పార్టీలతో చిదంబరం సంప్రదింపులు, ఇతర అంశాలు వివరిస్తూ... 'మారిన పరిస్థితుల నేపథ్యంలో' మరింత విస్తృత సంప్రదింపులు అవసరమని ప్రకటించినట్లు తెలిపారు. ఆ తర్వాత జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీని నియమించడం, అది ఆరు మార్గాలను సూచించడాన్ని కూడా పేర్కొన్నారు.

''తెలంగాణలో '2011-12 మధ్య అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారు. అనేక సంస్థలు, ముఖ్యంగా జేఏసీ రకరకాల రూపాల్లో ఉద్యమాలు లేవనెత్తింది. 2011 మార్చి 10న ట్యాంక్‌బండ్‌పైన తెలుగుకు కీర్తి చిహ్నాలైన శ్రీకృష్ణ దేవరాయ, అన్నమాచార్య, సర్‌ ఆర్థర్‌ కాటన్‌వంటివారి విగ్రహాలను ధ్వంసం చేశారు. జూలైలో మంత్రివర్గం నుంచి తెలంగాణ నేతలంతా రాజీనామా చేశారు. ఇవన్నీ కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాయి. మరోవైపు రాష్ట్రవిభజనకు అనుకూలంగా బీజేపీ, టీడీపీ, వైసీపీ లేఖలు ఇచ్చాయి. దీంతో కాంగ్రెస్‌కూ బలం వచ్చింది'' అని జైరాం రమేశ్ వివరించారు.

విభజనపై ప్రజల మనోగతం తెలుసుకుందాం
ఏపీ విభజనపై మంత్రివర్గ ఉపసంఘం వేద్దామన్న నా సూచనకు కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించింది. కేబినెట్‌ కార్యదర్శి దీని విధివిధానాలు వివరిస్తూ నోట్‌ జారీచేశారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించినదేమిటంటే, తెలంగాణ ఏర్పాటుకు కేబినెట్‌లో సానుకూల చట్టాల రూపకల్పన కోరుతూ హోంశాఖ ద్వారా ఉపసంఘానికి సూచన వచ్చింది.

ఉపసంఘాన్ని వేయగానే విద్య, నదీజలాలపై స్పష్టత ఇవ్వాలని, లేకపోతే సమస్యలు తప్పవని నిక్కచ్చిగా చెప్పానని అన్నారు. ''విభజనపై ప్రజల మనోగతం తెలుసుకుని, రంగంలోకి దిగుదాం. ఇందుకోసం వెబ్‌సైట్‌ ప్రారంభించి అభిప్రాయసేకరణ చేద్దాం'' అని నాటి హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు చెప్పగా ఆయన స్వాగతించారు.

కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించలేదు
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఆశ్చర్యం కలిగించగా, సొంత పార్టీ ముఖ్యమంత్రి ఇంత బాహాటంగా ఎలా తప్పుబట్టగలుగుతున్నారని సందేహం వ్యక్తంచేశాను. 2004నుంచి నాకు కిరణ్‌ తెలుసు. అయితే... సీఎంగా ఆయన హావభావాల్లో మార్పును గమనించాను. రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండా.. ఆమోదం పొందకుండా, అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజనకు ఆస్కారం లేదని కిరణ్‌ వాదించారు.

రాయల్ తెలంగాణపై చర్చ
ఏపీ విభజన సమయంలో రాయల్ తెలంగాణ చర్చ కూడా వచ్చింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలతో సంబంధం ఉంది. దీన్ని తెలంగాణలో కలపడంపై ఆలోచించాం. ఇదే సమయంలో రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను కూడా కలుపుతూ రాయలతెలంగాణ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనా వచ్చింది.

దీనిని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ సమర్ధిస్తూ ఇలా చేయడం వల్ల కొత్త రాష్ట్రం 'సెక్యులర్‌'గా అవతరిస్తుందన్నారు. రాయలసీమలోని కాంగ్రెస్ నేతలూ దీనిని సమర్ధించారు. ఈ దిశగా కసరత్తు చేయాలని అనంత, కర్నూలు జిల్లాల నేతలు రఘువీరారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కోట్ల సూర్యప్రకాశరెడ్డి తరచూ నన్ను కలిసేవారు. ఇందుకోసం 1600 పంచాయతీల తీర్మానాలతో తెలంగాణలో విలీనం కోరారు.

రాయలసీమ-తెలంగాణపై అసెంబ్లీకి బిల్లు పంపితే రెండు జిల్లాల ఎమ్మెల్యేలు 28 మంది మద్దతుంటుందని స్పష్టం చేశారు. ఈ రెండు జిల్లాలను తెలంగాణలో విలీనం చేయడం ద్వారా ఎంపీల సంఖ్య ఏపీ, తెలంగాణాల్లో సమానంగా ఉంటుందని వారు వాదించారు. దీంతో రాయల తెలంగాణగా 12 జిల్లాలతో బిల్లుల రూపకల్పన జరిగింది. కానీ, కాంగ్రెస్‌, మంత్రివర్గ ఉపసంఘం 10 జిల్లాల తెలంగాణకే ఓటేశారు.

ఏపీ రాజధానిపై మౌనం ఎందుకంటే
విభజన అనంతరం ఏపీ రాజధానిపైనా నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై అధ్యయనం, అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. ఇందులో భాగంగానే శివరామకృష్ణన్‌ కమిటీ వేశాం. కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ పేర్లను సూచించారు. అయితే విభజన సమయంలో రాజధానిని ప్రకటిస్తే ఏపీలో అలజడి మొదలవుతుందనే మౌనంగా ఉన్నామని వివరించారు.

ఏపీ రాజధాని మరో హైదరాబాద్ కాకూడదు
ఏపీ రాజధాని మరో హైదరాబాద్‌ కా కూడదు. కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు గుంటూరులో హైకోర్టు ఉంది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కాగా జబల్‌పూర్‌లో హైకోర్టు ఉంది. ఏపీలోనూ అభివృద్ధి కేంద్రీకృతం కారాదని కమిటీకి నేనుసూచించాను.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+