జగన్..నీ ఎమ్మెల్యేను నా మీద గెలిపించు: పాదాభివందనం చేస్తా: జలీల్ ఖాన్ సవాల్..!
మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ముఖ్యమంత్రి జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని విషయంలో జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారుని మండిపడ్డారు. కళ్ళు ఉన్నవాడు.. కడుపుకి అన్నం తింటున్న వాడు రాజధాని మారుస్తా అని అనడంటూ తీవ్రంగా స్పందించారు. పరిపాలన అంతా ఒక దగ్గర నుండే జరగాలని డిమాండ్ చేసారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన ఆయన.. సీఎం
జగన్ పతనానికి తానే నాంది పలికాడంటూ వ్యాఖ్యానించారు. అమరావతి లో రైతు సోదరులు..మహిళలు పోరాడుతున్నారని...వాళ్ళకి 13 జిల్లాల రైతులు..మహిళలు మద్దతు పలకాలిని జలీల్ ఖాన్ సూచించారు.
విశాఖ లో ప్రభుత్వ భూములు.. క్రిస్టియన్ సంస్థల భూముల మీద జగన్ కన్ను పడిందంటూ జలీల్ ఖాన్ ఆరోపించారు.
జగన్ కు జలీల్ ఖాన్ సవాల్...
2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే విజయవాడ పశ్చిమం నుండి జలీల్ ఖాన్ గెలిచారు. ఆ తరువాత టీడీపీలోని ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా టీడీపీ నుండి జలీల్ ఖాన్ కుమార్తె పోటీకి దిగారు. అక్కడ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస రావు గెలుపొంది..జగన్ మంత్రి వర్గంలో మంత్రి అయ్యారు. ఇప్పుడు, రాజధాని వ్యవహారం పైన స్పందించిన జలీల్ ఖాన్ సీఎంకు సవాల్ చేసారు.
జగన్ నీ ఎమ్మెల్యే ని రాజీనామా చేపించి...నా మీద పోటీ చేపించి గెలిపించు..ప్రజలు నీ వైపు ఉన్నారని నిరూపించు..అంటూ సవాల్ చేసారు. నీ పరిపాలన మీద ప్రజలు ఏమంటున్నారో తెలుసుకో....అంటూ కామెంట్ చేసారు.

పాదాభివందనం చేస్తా...నెత్తిన నీరు చల్లుకుంటా
ఒక్క చాన్స్ ఇవ్వండి ఏపీ ని ఇంద్ర లోకం చేస్తా అన్నాడంటూ సీఎం ను జలీల్ ఎద్దేవా చేసారు. హై పవర్ కమిటీ అంటే మేధావులు.. రిటైర్ జడ్జి లు ఉంటారు...గొర్రెల మందలా మీ మనుషులే ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బోస్టన్ కమిటీ కి రాజధాని పై అసలు అవగాహనా ఉందా అని ప్రశ్నించారు. మహిళలను రైతులను ఇబ్బంది పెడితే దేవుడు చూస్తూ ఉరుకోడని చెప్పుకొచ్చారు. అదే సమయంలో అమరావతి నుండి రాజధాని మార్చకుండా ఉంటే జగన్ కి పాదాభివందనం చేస్తా...నెత్తిన నీరు చల్లు కుంటా నంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. పరిపాలన అంతా ఒకే దగ్గర నుంచి జరగాలన్నారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్‌కు పాదాభివందనం చేస్తానన్నారు. జగన్ అంటే ఉద్యోగులు భయపడుతున్నారన్నారు. అందుకే ఉద్యోగులు సైలెంట్ అయ్యారని జలీల్‌ఖాన్ పేర్కొన్నారు.
-
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో కొత్త లోక్‌సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ???












Click it and Unblock the Notifications