వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముద్దులు కాకుండా ఏంచేస్తాడు, బతకనిస్తాడా: జగన్‌పై జలీల్ సంచలనం

వైసిపి అధినేత వైయస్ జగన్‌పై టిడిపి నేత, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఓట్ల కోసం తప్ప జగన్ అసెంబ్లీలో ఏనాడు ముస్లీంల గురించి మాట్లాడలేదన్నారు.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: వైసిపి అధినేత వైయస్ జగన్‌పై టిడిపి నేత, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఓట్ల కోసం తప్ప జగన్ అసెంబ్లీలో ఏనాడు ముస్లీంల గురించి మాట్లాడలేదన్నారు.

బ్రహ్మానందరెడ్డి గెలుపుపై భార్య: నీకేం అవసరం.. శిల్పాపై అఖిలప్రియబ్రహ్మానందరెడ్డి గెలుపుపై భార్య: నీకేం అవసరం.. శిల్పాపై అఖిలప్రియ

నెత్తిన చేతి, ముద్దులు

నెత్తిన చేతి, ముద్దులు

ప్రజల వద్దకు వెళ్లి నెత్తిన చేతులుపెట్టడం, ముద్దులు పెట్టడం మినహా ప్రజలకు జగన్ చేస్తోంది ఏమీ లేదని జలీల్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఎక్కడైనా వంద రూపాయలు ఇచ్చారా అని ప్రశ్నించారు.

Recommended Video

YSRCP Roja Tease Jaleel Khan as 'B Com Physics' in Assembly Sessions - Oneindia Telugu
చంద్రబాబునే కాలుస్తానన్నాడు, మిమ్మల్ని బతకనిస్తాడా?

చంద్రబాబునే కాలుస్తానన్నాడు, మిమ్మల్ని బతకనిస్తాడా?

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని నడిరోడ్డుపై కాలుస్తాననే విధంగా మాట్లాడారంటే రేపు పొద్దున జగన్ సీఎం అయితే మిమ్మల్నందరినీ ప్రాణాలతో బ్రతకనిస్తారా? అని ప్రజలనుద్ధేశించి వ్యాఖ్యానించారు.

సినిమా హీరోనా, మహాత్మా గాంధీయా?

సినిమా హీరోనా, మహాత్మా గాంధీయా?

జగన్ ఏమైనా సినిమా హీరోనా లేకుంటే మహాత్మా గాంధీనా.? అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు. ఈనెల 9నుంచి 21వరకు నంద్యాల నియోజకవర్గంలో పర్యటిస్తాను అంటున్నాడని, అక్కడికెళ్లి ఏం చేస్తావ్ తలమీద చేతులు పెడతాడని, ముద్దులు పెడతావ్ తప్ప చేసేదేమైనా ఉందా అన్నారు.

జగన్ నోటికి తాళం పడ్డట్లే!

జగన్ నోటికి తాళం పడ్డట్లే!

కాల్చివేత వ్యాఖ్యలు చేసిన జగన్ నోటికి ఎన్నికల సంఘం తాళం వేసినట్టేనని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదివారం అన్నారు. జగన్‌ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా కేసుగా నమోదుచేసి నోటీసులు జారీ చేయడం హర్షణీయమన్నారు. ఇక నుంచి జగన్‌ నోరును అదుపులో ఉంచుకొనేందుకు ఇది చక్కటి గుణపాఠమన్నారు.

ఇప్పుడు ప్రశాంతంగా ఉప ఎన్నికలు

ఇప్పుడు ప్రశాంతంగా ఉప ఎన్నికలు

ఎన్నికల సంఘం జగన్‌కు నోటీసులు ఇవ్వడంతో నంద్యాల ఉప ఎన్నికలు శాంతియుతంగా జరుగుతాయనే తాము నమ్ముతున్నామని, రాజకీయాల్లో నోటికి ఇష్టమొచ్చినట్లు మాడ్లాడితే ఎన్నికల సంఘం అక్షింతలు వేస్తుందని టిడిపి నేతలు అన్నారు. మంత్రులు నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారని, వైసిపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా మంత్రులు ప్రచారం నిర్వహించుకోవచ్చునని ఎన్నికలసంఘం అనుమతిచ్చిందన్నారు.

రోజా తీరుతో వైసిపికే నష్టం

రోజా తీరుతో వైసిపికే నష్టం

జగన్‌, రోజా చేసిన ప్రకటనలు అక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. రోజా ప్రచార తీరుతో టిడిపికే ప్రయోజనం ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి భాష మరింత అధ్వానంగా ఉందన్నారు.

English summary
Telugu Desam Party leader and MLA Jaleel Khan on Monday make controversial comments on YSR Congress Party chief YS Jaganmohan Reddy over Nandyal public meeting comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X