అధికార కాంక్షతోనే: జగన్‌పై జానా, ఇదేం లాజిక్: శ్రీధర్

సీమాంధ్ర నాయకుల పెత్తనం, జల దోపిడీ, ఒప్పందాల ఉల్లంఘన పైన ఆగ్రహించిన తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు. అధికారం పోగొట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అధికారం చేపట్టాలనుకుంటున్న జగన్‌లు తెలంగాణకు అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జివోఎం భేటీకి చంద్రబాబు ఎందుకు హాజరు కాలేదో చెప్పాలన్నారు.
సీమాంధ్ర ప్రజల ఆందోళనలను పరిష్కరించాలంటున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎందుకు నివేదిక ఇవ్వలేదన్నారు. అధికారం ఉండగా పల్లకీ మోయించుకున్న జగన్, అధికార కాంక్షతో పార్టీ పెట్టారని, అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా సువర్ణ రాష్ట్రంగా చేస్తారో చెప్పాలన్నారు. విభజన నిర్ణయం అధికార దాహంతో చేసింది కాదన్నారు. అధికారం కోసం అర్రులు చాస్తున్న పార్టీలను తిప్పి కొట్టాలని, తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు కొమురం భీం అదిలాబాద్ జిల్లాగా నామకరణం చేస్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసును నిలబెట్టుకోవాలన్నారు.
తెస్తే వాళ్లు తేకుంటే మేమా: శ్రీధర్ బాబు
కొందరు నాయకులు తెలంగాణ తెస్తే తమ ప్రయత్నంగా, తేకుంటే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలది తప్పన్నట్లుగా కొందరు నేతలు మాట్లాడారని, ఇదేం తీరని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. తాము బిల్లు పెట్టాక యాత్రలు కాకుండా ఇతర పార్టీల పైన దండయాత్ర చేస్తామన్నారు. ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతమంటున్న చంద్రబాబును టిడిపి నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. అదిలాబాదు జిల్లాలో అన్ని సీట్లను కాంగ్రెసు పార్టీయే గెలుచుకుంటుందన్నారు.
సోనియా ఆశలు నెరవేర్చారు: గీతా రెడ్డి
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్న సోనియా దానిని నెరవేర్చారని మంత్రి గీతా రెడ్డి అన్నారు. సోనియా మాటిస్తే తప్పే వ్యక్తి కాదన్నారు.












Click it and Unblock the Notifications